చంద్రబాబుతో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ముచ్చట్లు - చంద్రబాబు నాయుడుతో కపిల్‌దేవ్ ముచ్చట్లు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ యాదృచ్ఛికంగా కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.
![చంద్రబాబుతో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ముచ్చట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4704043-732-4704043-1570657564817.jpg)
కపిల్‌దేవ్
సరదాగా కాసేపు
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్, తెదేపా అధినేత చంద్రబాబు కాసేపు ముచ్చటించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయల్దేరారు. అదే విమానంలో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఉన్నారు. రామినేని ఫౌండేషన్ విద్యా పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కపిల్ గుంటూరు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరిద్దరూ కలిశారు. క్రికెట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిస్తోంది.
TAGGED:
chandrababu and kapil dev