Ex cm with AICC leaders: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతోనే ఆయన హస్తిన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి దిల్లీలో గడపనున్నారు.
దిల్లీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో భేటీ..! - congress news
ex cm kiran kumar reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్వవైభవానికి అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తుందా... ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని దిల్లీకి పిలిచిందా... రెండు, మూడు రోజులు ఆయన అక్కడే ఉండి.. కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
kiran
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌తో పాటు పార్టీలోని పెద్దలను ఆయన కలవనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై కిరణ్‌కుమార్‌రెడ్డితో పార్టీ పెద్దలు చర్చించే అవకాశముందని తెలుస్తోంది.