గత వారం ట్యాంక్‌బండ్‌పై పర్యాటక సందడి ఉన్న చిత్రాలతో.. దీనికి సంగీతం తోడైతే ఇంకా బాగుంటుంది.. పరిశీలించండంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్పందించిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ హెచ్‌ఎండీఏ తరఫున పలు కార్యక్రమాలు చేసేందుకు ఆదేశాలిచ్చారు. సెప్టెంబరు 12 నుంచి ఇవి మొదలు కానున్నాయి.
నేడే షురూ..!:
ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ ఏఓసీకి చెందిన భారత్ సైన్యం బ్యాగ్‌పైపర్ బృందం సంగీత ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతోపాటు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ పలువురు జానపద గాయకులు, రాక్‌బ్యాండ్స్, ర్యాపర్ల, కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఉండనున్నాయి. ఆహార స్టాళ్లు కొలువుదీరనున్నాయి. అయితే ఆట, పాటకు అదనంగా సాగర్‌లో నిర్వహించే లేజర్ షో కనువిందు చేయనుంది.