ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జైలు నుంచి వెళ్లలేక మహిళ ఖైదీల కంటతడి - వరంగల్​ సెంట్రల్​ జైలు

తెలంగాణలోని వరంగల్​ సెంట్రల్​ జైలు స్థానంలో నిర్మించతలపెట్టిన సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపగా.. ఖైదీల తరలింపు ప్రారంభమైంది. తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు.

prisoners
ఖైదీల కంటతడి

By

Published : Jun 1, 2021, 7:06 PM IST

తెలంగాణలోని వరంగల్ కేంద్ర కారాగార ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. తమ సామగ్రితో ఖైదీలు.. ఇతర జైళ్లకు బయలుదేరి వెళ్లారు. కారాగార స్థలంలో... అధునాతన వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపగా.. ఖైదీల తరలింపు అనివార్యమైంది.

మామ్​నూర్ ప్రాంతంలో... అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త జైలు నిర్మించనున్నారు. అప్పటి వరకు ఇక్కడి ఖైదీలకు... హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లలో ఆవాసం కల్పిస్తారు. ఖైదీల తరలింపును జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది పర్యవేక్షించారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు.

ఇదీ చూడండి:

ఈజీఎస్ నిర్వాకం: బయట బతికే ఉన్నాడు.. రికార్డుల్లో చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details