శ్రీకాకుళంలో భారీగా కురుస్తున్న వర్షాలు.. నీట మునిగిన బస్టాండ్ - Rain Forecast for AP
శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరివాహ ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి బస్టాండ్ దుస్థితిపై ఎవరూ పట్టించుకోవడం లేదని.. ప్రయాణికులు మండిపడుతున్నారు.
శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షాలపై ముఖాముఖీ
.
Last Updated : Oct 9, 2022, 1:00 PM IST