ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1Pm - ఏపీ వార్తలు

.

1pm top news
1pm టాప్ న్యూస్

By

Published : Jun 18, 2020, 1:01 PM IST

  • బిల్డ్ ఏపీపై హైకోర్టులో 10 పిటిషన్లు

బిల్డ్ ఏపీ కింద భూములు అమ్మేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. దాఖలైన పిటిషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

ద్రవ్య వినిమయ బిల్లు ఆగిపోవడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లు పెట్టాలని ప్రతిపక్షం అడిగితే ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆగ్రహం

తనకు ఎస్కార్ట్‌ తొలగించడం, భద్రత తగ్గించడంపై శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. సంప్రదాయాలంటే ఇవేనా? ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మమ్మల్ని ఇంటికి చేర్చండయ్యా

కూలీ కోసం వలస వెళ్లిన తమ బతుకులను.. కంటికి కానరాని కరోనా అనే ఒక చిన్న జీవి అతలాకుతలం చేస్తోందని రాష్ట్రానికి చెందిన వాళ్లు ఆవేదన చెందుతున్నారు. కువైట్​లో చిక్కుకున్న తమను.. ప్రభుత్వమే స్వదేశానికి చేర్చాలని వారు వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వయం సమృద్ధికి తొలిమెట్టు

కరోనా సంక్షోభాన్ని భారత్​ అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఈ విపత్తు గుర్తుచేసిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • త్యాగాల వెనుక కదిలించే గాథలు

దేశంకోసం మనం ఏ చేశాం అంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు సైనికులు. దొంగ దెబ్బతీసే శత్రుమూకలతో పోరాడుతూ ప్రాణాలనే అర్పిస్తున్నారు. ఇలా చైనా దుశ్చర్యలో వీరమరణం పొందిన జవాన్ల నిజ జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మరి వాటి గురించి తెలుసుకుందాం!

  • హాంకాంగ్ విషయంలో చైనా పునరాలోచించుకోవాలి

హాంకాంగ్​పై జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి జీ-7 సభ్య దేశాలు. ఈ నిర్ణయంపై చైనా పునరాలోచించుకోవాలంటూ అన్ని దేశాలు సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రతికూలంగా వృద్ధి అంచనాలు

కరోనా నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా నివేదికల్లో పేర్కొంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీ20 ఉండకపోవచ్చు

కరోనా వ్యాప్తి నడుమ టీ20 ప్రపంచకప్​ నిర్వహణ దాదాపు అసాధ్యమని పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో ప్రపంచంలో మళ్లీ కలుద్దాం

బాలీవుడ్​ కథానాయకుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​పై అతని స్నేహితుడు, నటుడు సిద్ధార్థ్​ గుప్తా సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సుశాంత్​తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అవకాశాలున్న ప్రపంచంలో మళ్లీ కలుద్దాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details