- పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని
పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. దిల్లీ వెళ్లి జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్వయంగా మంత్రే పేకాట ఆడిస్తున్నారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. నిజాలు మాట్లాడిన పట్టాభిపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భీమడోలు మండలం పూళ్లలో 27కు చేరిన బాధితులు
భీమడోలు మండలం పూళ్లలో అంతుచిక్కని వ్యాధి కలవర పెడుతోంది. బాదితుల సంఖ్య 27కు చేరింది. కొందరు కళ్లు తిరిగి ఆస్పత్రిలో చేరుతున్నారు. చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ఏలూరు తరహా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నందున వైద్యశాఖ అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుపతి పార్లమెంటరీ తెదేపా కార్యాలయం ప్రారంభం
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా కార్యాలయం ప్రారంభమైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల
ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా మహమ్మారితో మహిళలకు కొత్త కష్టాలు
ఉరుకులు పరుగుల జీవితంలో మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు ఒక మజిలీగా కరోనా లాక్డౌన్ ను భావించారు చాలామంది. అయితే గణాంకాలు మాత్రం మహిళల విషయంలో లాక్డౌన్ ప్రతికూల ప్రభావం చూపిందంటున్నాయి. పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమైన వేళ.. మల్టీ టాస్కింగ్ పేరుతో మహిళలు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఇంత చేసినా ఫలితం శూన్యం. వారిపై మానసికంగా, శారీరకంగా హింస పెరిగిపోయిందనే లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్లో డ్రాగన్ పేరు ఇక 'కమలం'