ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - top news

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ న్యూస్

By

Published : Feb 9, 2021, 9:00 AM IST

  • పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రెండో విడతలో 522 పంచాయతీలు ఏకగ్రీవం.. ఇప్పటి వరకూ మొత్తం 1,047

రాష్ట్రంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 3,291 పంచాయతీల్లో 522 ఏకగ్రీవమయ్యాయి. వీరిలో అత్యధికంగా వైకాపా మద్దతుదారులు ఉన్నారు. రెండో విడతకు సంబంధించి సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కొన్ని పంచాయతీల్లో పోటీలో ఒకే అభ్యర్థి మిగలటంతో ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిత్తూరులో అర్ధరాత్రి వైకాపా మద్దతుదారుల ఆందోళనలు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో.. అధికార పార్టీ నేతలు అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులను భయాందోళనలకు గురి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మానవ తప్పిదాలతో పర్యావరణ ప్రతీకారం

మానవ తప్పిదాలతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇది మానవ జాతి మనుగడకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే.. దాని పర్యవసానాలు ఎంతో భయానకంగా ఉంటాయో.. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్​ ధౌలిగంగ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఇలా వైపరీత్యానికి మానవ తప్పిదాలూ జతపడబట్టే ఈ ఊహాతీత ఉత్పాతాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్వీట్ల కోసం తారలపై ఒత్తిళ్లు.. దర్యాప్తునకు ఆదేశం!

రైతుల ఉద్యమంపై ట్వీట్లు చేయాల్సిందిగా తారలపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలపై నిఘా విభాగం దర్యాప్తు చేపట్టనుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ స్పష్టం చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ వంటివారు ఇటీవలే కేంద్ర సర్కారుకు బాసటగా ట్విటర్లో స్పందించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దిల్లీ హైకోర్టులో ఫ్యూచర్ గ్రూప్​న​కు ఊరట

ఫ్యూచర్​ గ్రూప్​నకు ఊరటనిచ్చింది దిల్లీహైకోర్టు. రిలయన్స్​తో కుదుర్చుకున్న ఒప్పందంపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మయన్మార్​లో 'కర్ఫ్యూ'- కఠిన ఆంక్షలు

మయన్మార్​లో చెలరేగిన ఆందోళనలను కట్టడి చేసేందుకు సైనిక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ప్రజలు బహిరంగంగా గుమిగూడటాన్ని నిషేధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో స్వర్ణంతో మెరిసిన నందిని

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్​లో తెలుగమ్మాయి నందిని స్వర్ణం సాధించింది. 13.83 సెకన్లలో పరుగును పూర్తిచేసింది. ఈ టోర్నీలో నందినికి ఇది రెండో బంగారు పతకం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వెంకీ హీరోగా 'దృశ్యం2'కు రంగం సిద్ధం

మలయాళ చిత్రం 'దృశ్యం2'ను తెలుగులో రీమేక్​ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'దృశ్యం'లో హీరోగా చేసిన వెంకటేష్ ఇందులోనూ ప్రధాన పాత్రలో నటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details