- స్థానిక పోరు ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష.. సీఎస్, డీజీపీ హాజరు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. పంచాయతీ ఎన్నికల విషయమై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గవర్నర్ చెంతకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్.. వేర్వేరుగా భేటీలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా రాజ్‌భవన్‌కు వచ్చారు. ఎస్‌ఈసీ భేటీ తర్వాత... ఆయన గవర్నర్‌ను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్థానిక ఎన్నికల్లో.. అన్ని చోట్లా 'భాజపా- జనసేన' కూటమి పోటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాలని భాజపా- జనసేన కూటమి నిర్ణయించింది. ఇరు పార్టీల అగ్ర నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎర్రకోట ఘటనపై రంగంలోకి ఎన్ఐఏ!
రైతులు చేపట్టిన 'గణతంత్ర పరేడ్'లో.. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న పంజాబ్ గాయకుడు దీప్ సిద్ధు, దీప్ దీపు అనే మరో వ్యక్తికి మంగళవారం సాయంత్రమే ఎన్ఐఏ నోటీసు పంపినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- విరాట్, తమన్నా, అజులకు కేరళ హైకోర్టు నోటీసులు
ఆన్లైన్ జూదం నిషేధం కేసులో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, నటుడు అజు వర్ఘీస్‌లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ