ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Malavath Purna Interview: 'సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు' - Etv Bharat Special interview with Malavath

Malavath Purna Interview : అలవోకగా కొండలను ఎక్కటం ఆమెకు అలవాటు. పర్వతాలను అధిరోహిస్తూ సత్తా చాటాలని తాపత్రయం. అందుకే 13 ఏళ్ల వయసుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించి.. అత్యంత పిన్న వయస్కురాలైన పర్వతారోహకురాలిగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఏడు అత్యంత ఏత్తైన పర్వతాలను అధిరోహించి ఔరా అనిపించింది.. తెలంగాణ అమ్మాయి మలావత్ పూర్ణ. పూర్ణ పర్వాతారహణలో ఏం చేయాలనుకుంటోంది? భవిష్యత్తు ప్రణాళికలపై మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

Malavath Purna Interview
మలావత్ పూర్ణ

By

Published : Jun 14, 2022, 4:16 PM IST

మలావత్ పూర్ణ

'నేను 13ఏళ్లకే ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించాను. ప్రపంచంలోని ఏడు ఏత్తైన పర్వతాలు అధిరోహించాను. ఏడు ఏత్తైన పర్వతాల అధిరోహణకు చాలామంది ప్రోత్సహించారు. గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు అంతా సొసైటీవాళ్లు చూసుకునేవారు. పర్వతారోహకులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి. ఎవరెస్ట్‌ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మృతదేహాలు చూసి భయపడ్డాను. కానీ సంకల్ప బలం ఉంటే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు. తల్లిదండ్రులు తమ ఆడ, మగ పిల్లలపై వ్యత్యాసం చూపొద్దు. ఇకపై నిధులు సేకరించి ఆడపిల్లల చదువుకు ఉపయోగిస్తాం. అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టి అనుకున్నది సాధించాలి.'- పర్వతారోహకురాలు మలావత్‌ పూర్ణ

ABOUT THE AUTHOR

...view details