'ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది' - చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారికతో ఈటీవీ భారత్ ముఖాముఖి
చెస్ ఒలంపియాడ్లో భారత్ స్వర్ణం సాధించింది... ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో... రష్యాతో హోరాహోరీగా తలపడింది. సాంకేతిక సమస్యలతో నిర్వాహకులు రెండు దేశాలను విజేతలుగా ప్రకటించారు. భారత్ తరఫున పాల్గొన్న 12 మందిలో ఒకరైన ద్రోణవల్లి హారిక... ఈ విజయాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకుంది.
చదరంగం టోర్నీల్లో ఒలింపిక్స్‌లా భావించే ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణంతో మెరిసింది. రెండేళ్లకోసారి అంతర్జాతీయ చెస్ సమాఖ్య- ఫిడే నిర్వహించే ఈ టోర్నీ... కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఫైనల్లో రష్యాతో హోరాహోరీగా జరిగిన ఈ టోర్నీలో... సర్వస్ సమస్యలు, భారత జట్టు ఆధిపత్య ఆటతీరుతో.. రష్యాతో కలిసి సంయుక్తంగా భారత జట్టుకు ఫిడే స్వర్ణం ప్రకటించింది. 12 మంది సభ్యులు పాల్గొన్న భారత జట్టులో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటల హరికృష్ణ భాగం అవ్వటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లోస్వర్ణం గెలవటం పట్ల... జట్టులో భాగస్వామి అయిన ద్రోణవల్లి హారికతో ఈటీవీ భారత్ ముఖాముఖి.