ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ - bharat debate

కొన్నేళ్లుగా మాటల్లోనే ఉన్న ప్రతిపాదనను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. రైల్వే మార్గాల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపింది. 109 మార్గాల్లో.. 151 రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. అదానీ, టాటా, ఎస్సెల్ వంటి దేశీయ కంపెనీలతో పాటు.. పలు విదేశీ కంపెనీలు కూడా ఇండియన్ రైల్వేపై ఆసక్తి చూపుతున్నాయి. భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తీసుకోవడంపై అటు రైల్వే వర్గాల్లోనూ... ఇటు సామాన్య ప్రజల్లోనూ కదలిక వచ్చింది. కేవలం 5 శాతం రూట్లే కాబట్టి ఈ విషయం గురించి ఆందోళన అవసరం లేదని రైల్వే శాఖ చెబుతోంది. వీటన్నింటి గురించి విశ్లేషించేందుకు ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చను చేపట్టింది.

etv bharat discussion on Indian railways privatization
etv bharat discussion on Indian railways privatization

By

Published : Jul 13, 2020, 6:06 AM IST

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ

రైల్వేలో 5 శాతం రూట్లను ప్రైవేటీకరించేందుకు తీసుకున్న నిర్ణయంపై.. అదే శాఖలో ఉన్నతస్థాయిలో పనిచేసిన వారి నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్టుబడులు భారీగా వస్తాయి కాబట్టి ఆహ్వానించదగిన పరిణామమే అని దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత జనరల్ మేనేజర్ సి. రామకృష్ణ చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు భారతీయ రైల్వేలకు అందించే ఈ నిర్ణయాన్ని అడ్డుకోకపోవడం మంచిదన్నారు. కానీ.. రైల్వేలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రైవేటీకరణకు బాటలు పరుస్తున్నారంటూ.. ఇది మంచి నిర్ణయం కాదంటూ.. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య, రైల్వే రంగ నిపుణులు చలసాని గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతిమంగా.. ఈ నిర్ణయంతో రైల్వే శాఖకు నష్టం వాటిల్లుతుందని.. సామాన్యులు ఛార్జీలు భరించలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం చెబుతున్న ఆ 5 శాతం మార్గాలతోనే రైల్వేకు 63 శాతం ప్రయాణికులు ఉన్నారన్నారు. ప్రైవేటీకరణ అమలవుతూ పోతే.. సామాన్యులు రైల్వే స్టేషన్లకు వెళ్లే అవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ

ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనుకున్నది 5 శాతం మార్గాలే కాబట్టి.. సామాన్యులకు వచ్చే నష్టం ఎంత మాత్రం ఉండదని.. దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత జనరల్ మేనేజర్ సి. రామకృష్ణ అభిప్రాయపడ్డారు. పోటీతత్వం పెరిగి నాణ్యమైన సేవలు అందుతాయని చెప్పారు. ఖర్చు చేయగలిగిన వారే.. ప్రైవేటు రైళ్లలో ప్రయాణిస్తారని అభిప్రాయపడ్డారు. లాభాలు వచ్చే మార్గాలనే ప్రైవేటు సంస్థలు తీసుకుంటాయి కాబట్టి.. సామాన్యులకు ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ.. ప్రైవేటీకరణతో ధరల పెంపు తప్ప సామాన్యులకు ఒనగూరే లాభం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య స్పష్టం చేశారు. రాయితీలతో రైల్వేకు ఏర్పడుతున్న ఆదాయ లోటును.. కేంద్రమే ప్రత్యేక బడ్జెట్ తో చెల్లించాల్సి ఉందన్నారు. లాభాలు వచ్చే మార్గాలను ప్రైవేటు సంస్థలకు అందించకూడదని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు సర్వీసులు తగ్గిపోయే అవకాశం ఉందని.. ఉద్యోగ అవకాశాలపైనా దెబ్బ పడుతుందని రైల్వే రంగ నిపుణులు చలసాని గాంధీ అభిప్రాయపడ్డారు. నష్టాలు వచ్చే మార్గాల్లో ప్రైవేటు సేవలు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. అన్ని ప్రాంతాల వారికి సౌకర్యం కల్పించడం కోసం పని చేస్తున్న రైల్వేలో ఇలాంటి విధానం సరికాదని స్పష్టం చేశారు.

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ

రైల్వేల్లో 5 శాతం మార్గాలను ప్రైవేటీకరించేందుకు తీసుకున్న నిర్ణయం.. కచ్చితంగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని చలసాని గాంధీ చెప్పారు. కార్మికులను, ప్రజలను చైతన్యవంతం చేస్తామని.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు ఉద్యమాలు చేస్తామని తేల్చి చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు అభద్రతాభావంతో ఉన్నారని రాఘవయ్య చెప్పారు. దశలవారీగా పూర్తి స్థాయి రైల్వేల అమ్మకానికి ఇది తొలిమెట్టుగా అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ప్రయోగాత్మకంగా అమలు కానున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం మంచిదని దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత జనరల్ మేనేజర్ సి. రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో ఉన్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details