- ట్రంప్ X బైడెన్: టాప్ 10 హైలైట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అధ్యక్ష పీఠానికి జో బైడెన్ కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలోనే నిలిచినా.. ట్రంప్‌కు కూడా ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. అయితే, బైడెన్‌కు మార్గం సుగమం చేసిన మిషిగన్, విస్కాన్సిన్ ఓట్ల లెక్కింపుపై ఆరోపణలు చేస్తూ ట్రంప్ కోర్టుకెక్కిన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ట్రంప్xబైడెన్: అమెరికాలో నిరసనల హోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టతరాకపోవడం సహా డొనాల్డ్ ట్రంప్ న్యాయ పోరాటానికి దిగిన వేళ ట్రంప్ అనుకూల వ్యతిరేక వర్గాల నిరసనలతో అగ్రరాజ్యం హోరెత్తుతోంది. ప్రతి ఓటు లెక్కించాలనే డిమాండ్‌తో పలు నగరాల్లో ఆందోళనకారులు నినాదాలు చేయగా మరికొన్ని చోట్ల ట్రంప్ వెళ్లిపోవాలనే డిమాండ్‌తో ప్రత్యర్థి వర్గీయులు ర్యాలీ తీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమరావతి భూములపై విచారణ: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
ఏపీ రాజధాని అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం
నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తెదేపా హయాంలో ఇళ్లు నిర్మించుకున్నారని పేదలపై అక్కసా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నారనే అక్కసుతోనే వారికి ఇళ్లు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా 17 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'దీదీ'పై ప్రజాగ్రహం స్పష్టంగా తెలుస్తోంది: షా