- గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలే కనిపిస్తుంటాయి. భారతీయులు సగర్వంగా సెల్యూట్ చేసే త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది.. మన తెలుగువాడైన పింగళి వెంకయ్యనే. ఆయన కుమార్తె సీతామహాలక్ష్మీని కలిసేందుకు నేడు ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా మాచర్ల వస్తున్నారు. వెంకయ్య కుటుంబ సభ్యులను సత్కరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నగర, పురపాలిక ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్
రాష్ట్రంలో బుధవారం జరిగిన 12 నగరపాలక, 71 పురపాలిక, నగరపంచాయతీల ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 62.28 శాతం నమోదైనట్లు తొలుత అంచనాకు వచ్చిన ఎస్ఈసీ గురువారం తుది వివరాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తూర్పుగోదావరి జిల్లా: కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద.. కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో.. ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వడగాలులు మొదలయ్యాయ్... జర భద్రం
రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా శుక్రవారం, శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అమృత్ మహోత్సవ్'కు నేడు మోదీ శ్రీకారం
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. దండి మార్చ్ ప్రారంభమై 91 ఏళ్లైన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 241 కి.మీ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అటు.. దేశవ్యాప్తంగా అమృత్ ఉత్సవాలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేరళ ఆనవాయితీ మారేనా? సర్వేలన్నీ వామపక్షాల వైపే!
కేరళ, తమిళనాడులో ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మారుస్తుంటారు ప్రజలు. అయితే ఆ ఆనవాయితీని పక్కనపెడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అధికార పక్షమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేరళలో జరగనున్న ఎన్నికలపైనే ఉంది. ప్రస్తుత పాలకపక్షం ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందా? యూడీఎఫ్‌కు అధికార బదిలీ జరుగుతుందా? లేక భాజపా మెట్రోమ్యాన్ వ్యూహం ఫలిస్తుందా? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- 'సెనేట్ సీటు అమ్ముకొన్న ఇమ్రాన్ ఖాన్'
ఓ వ్యాపారవేత్తను సెనేటర్‌గా చేసేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 700 మిలియన్ల పాక్ కరెన్సీని తీసుకున్నారని ఆ దేశ మాజీ ప్రధాని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ దీన్ని సుమోటోగా పరిగణించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సంకోచాలు వద్దు.. టీకాలు తీసుకోండి'
ఎలాంటి సంకోచాలు లేకుండా టీకాలు తీసుకోమని అమెరికన్లకు మాజీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బరాక్ ఒబామా, జార్జి బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ ప్రచార చిత్రం ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఖతార్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోనే ఫెదరర్ ఓటమి
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. ఖతార్ ఓపెన్లో ఉసూరుమనిపించాడు. ఏడాది తర్వాత కోర్టులోకి అడుగుపెట్టిన రోజర్.. క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలయ్యాడు. జార్జియా ప్లేయర్ బసిల్ష్విలి చేతిలో ఓడిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రామ్‌చరణ్‌తో మరోసారి జతకట్టనున్న కియారా!
రామ్‌చరణ్, కియారా అడ్వాణీ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు వినయ విధేయ రామ సినిమాలో జోడీ కట్టిన ఈ జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. దిల్‌రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ ప్రకటన.. ఇదివరకే అధికారికంగా వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.