ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - telugu updates

ప్రధాన వార్తలు @ 9 AM

టాప్ టెన్ న్యూస్
టాప్ టెన్ న్యూస్

By

Published : Mar 2, 2021, 9:00 AM IST

  • బలవంతంగా ఉపసంహరణలు జరిగిన చోట.. నేడు మళ్లీ నామినేషన్లు!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా... గతంలో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన చోట.. నేడు మరోసారి నామపత్రాలు స్వీకరించేందుకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కియా పరిశ్రమ ఎదుట ఘోర రోడ్డుప్రమాదం...నలుగురు మృతి

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు... గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంద్రకీలాద్రిపై ధ్వంస రచన... ఈవో మారిన ప్రతిసారీ కొత్త ప్రణాళికలు.. రూ.కోట్లు వృథా

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. కొండపై గత పదిహేనేళ్లలో రూ.కోట్లు వెచ్చించి అనేక భవనాలు నిర్మించారు. అయితే ఆలయానికి ఈవోలు మారిన ప్రతిసారీ.. అభివృద్ధి పేరిట కొత్తగా నిర్మాణాలను చేపట్టడం... పాత వాటిని కూలగొట్టడం ఆనవాయితీగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్​కు కొవిడ్ టీకా

రాష్ట్రంలో రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ టీకా వేయించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్​పుర్​​​ రహదారివద్ద ట్రాలీ బోల్తా పడి ఆరుగురు కార్మికులు చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగాల్​ బరిలో నెగ్గేదెవరు- దీదీ హ్యాట్రిక్‌ కొడతారా?

ఈసారి బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి రెండు సార్లు అధికారపీఠాన్ని చేజిక్కించుకున్న మమతా బెనర్జీ.. హ్యాట్రిక్ కొడతారా? బంగాల్​ పోరును ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న భాజపా.. కాషాయ జెండా ఎగురవేస్తుందా? గతంలో తృణమూల్​ కాంగ్రెస్​కు అండ నిలిచిన ముస్లింలు ఈసారి ఎటువైపు? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

  • గట్టెక్కే దాకా పరిశ్రమలకు గట్టి చేయూత అవసరం

కొవిడ్‌ వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన కార్పొరేట్‌ కంపెనీలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలకు ఉపక్రమించింది. అయితే.. ఆ మద్దతు కేవలం వాటి రుణ సమస్యలను పరిష్కరించేలా మాత్రమే కాదు- భవిష్యత్తులోనూ సంక్షోభాలను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాన్ని కల్పించేలా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక వృద్ధికి, స్థిరత్వానికి అది చాలా అవసరం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంగ్లాండ్​తో టీ20లకు వరుణ్​ దూరం!

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు భారత జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి.. ఆడేది మాత్రం అనుమానంగానే ఉంది. గాయం కారణంగా మరోసారి టీమ్​కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో వరుణ్​ విఫలమయ్యాడని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోహన్​బాబు ఆత్మకథ 'నా రూటే సపరేటు'!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్​బాబు. సినిమాలతో పాటు రాజకీయ, విద్యారంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆయన జీవితంలోని విషయాలను పుస్తక రూపంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. దానికి 'నా రూటే సపరేటు' అనే టైటిల్ ఖరారు చేశారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details