- ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మధ్య వివాదం చెలరేగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సమావేశానికి హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్ కుమార్కు వర్తమానం వెళ్లడం వివాదానికి కారణమైంది. దీనిపై ఎస్ఈసీ తీవ్రంగా స్పందించారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతు దైన్యం
మరో పక్షం రోజులు ఆగితే బస్తాలకొద్దీ వడ్లు ఇంటికొస్తాయన్న అన్నదాతల ఆశలపై వాయుగుండం వరదనీరు చల్లింది. గింజ దశలో ఉన్న వరిని ముంచెత్తింది. రోజుల తరబడి పంట నీటిలోనే నానింది. ఉద్యానపంటలూ తుడిచిపెట్టుకుపోయాయి. ఎకరానికి వేలల్లో పెట్టుబడి పెట్టినా వడ్లగింజ కాదు కదా... పశువుల మేతకు ఎండుగడ్డి అయినా మిగల్లేదని ఉభయ గోదావరి జిల్లాల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరువూ దక్కలేదు.. పైసలూ పోయె!
2018లో ఏవీ రమణదీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై తితిదే అధికారులు రూ.200 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం కోర్టులో రూ.2 కోట్లు ధరావతు కూడా చెల్లించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. కొత్త ఛైర్మన్ వద్ద పరువునష్టం దావా విషయం ప్రస్తావనకు రాగా... తాము దాన్ని ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. తితిదే చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టెక్కలిలో మాయ లేడి... ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ!
నిరుద్యోగుల ఆశలే ఆమె పెట్టుబడి. తన చేతిలో అధికారులు, నాయకులు ఉన్నారంటూ మాటల గారడీతో ఎదుటివారిని బుట్టలో వేసుకుని కుచ్చుటోపీ పెట్టడం ఆమెకున్న నైపుణ్యం. ఈక్రమంలో ఒకరు కాదు..ఇద్దరు కాదు..తీగ లాగుతూ వెళితే మోసపోయిన వారి సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఈ తంతు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టండి'
భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టాలని అన్నిరాష్ట్రాలను కేంద్ర భూగర్భ జలమండలి కోరింది. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆల్ఫాబెట్స్ రానివాళ్లు ఉద్యోగాలిస్తారట: నితీశ్