ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

9 pm top news
9 pm ప్రధాన వార్తలు

By

Published : Aug 15, 2020, 8:59 PM IST

  • 'స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుతాం'
    కరోనా వైరస్ ఉద్ధృతి... భారీ వర్షాల మధ్య... రాజధాని రైతులు తమ నిరసనను కొనసాగించారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా... అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వరుసగా 240వ రోజూ ఆందోళనలు చేపట్టారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలు... స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారీ వర్షం.. వరద ప్రవాహం... పంట నష్టం... ఇదీ ప్రస్తుత చిత్రం
    అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వానలు ముంచెత్తుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు వరద నీటితో నిండుకుండను తలపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో మరో మూడ్రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాలతో వరి, పెసర, మినుము పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. పంటలు నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మన నౌకాదళం శక్తి సామర్థ్యాలు ఏంటంటే..
    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నౌకాదళం తన శక్తి సామర్ధ్యాలను తెలియజేసే లఘు వీడియోను విడుదల చేసింది. ఇందులో భారత నౌకాదళం యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములు, ఇతర ఆయుధ సంపత్తిని... ప్రత్యేకించి నావికుల సాహసిక దృక్పథాన్ని తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కోసం క్లిక్ చేయండి.
  • సైబరాబాద్ కమిషనరేట్​లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ
    పాట వెనుక ఉన్న స్పూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ అన్నారు. దేశం మన కోసం ఏం చేసిందని కాకుండా... దేశం కోసం మనం ఏం చేశామని భావించాలని ఆయన సూచించారు. సినీ గాయకుడు శ్రీరామ్ ఆలపించిన గీతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరించిన సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపోత్సవం
    స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ, అమరావతిలోని ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీప కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రాజ్​భవన్, రహదారులు భవనాల కార్యాలయ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, మహాత్మా గాంధీ రోడ్ ఇలా అన్ని ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చూపరులను ఆకర్షిస్తోంది. ఆ విద్యుద్దీపాలంకరణ కోసం క్లిక్ చేయండి.
  • స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకం.. భాజపా కార్యకర్త మృతి
    బంగాల్​లోని హూగ్లీ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకల్లో అధికార టీఎంసీ, భాజపా మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తి.. హింసాత్మకంగా మారింది. ఈ దుర్ఘటనలో ఓ భాజపా కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • దేశంపై ప్రేమతో ఇంటిలోనే 'ఇండియా మందిర్​'
    దేశంపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు కర్ణాటక ఛామరాజనగర్​కు చెందిన ఓ వ్యక్తి. తన ఇంటిలో 'ఇండియా మందిర్'​ను నిర్మించి పూజలు చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్నాడు. కూలీ పనులు చేసుకునే ఆ వ్యక్తి దేశభక్తిలో ఇతరులకు ఒక నమూనాగా నిలిచాడు. మరి ఆ దేశభక్తుడు ఎవరో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
  • కరోనా వ్యాక్సిన్‌పై రష్యాతో భారత్‌ చర్చలు!
    కరోనా వ్యాక్సిన్​ ఫేజ్​-1,2 క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించి రష్యాను భారత్ సాంకేతిక సమాచారం కోరినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్​ దేశీయ ఉత్పత్తి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు రష్యా మీడియా స్పుత్నిక్ పేర్కొంది. 'స్పుత్నిక్​-వీ' టీకాపైనా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ వీడ్కోలు
    అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్​స్టా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2004 డిసెంబరు 23న తొలి వన్డే మ్యాచ్‌ ఆడాడు మహీ.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'ఇక ఆపండి.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు'
    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయల్లోకి రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కంగన.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details