ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ టెన్ న్యూస్

By

Published : May 5, 2021, 9:00 AM IST

  • నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతికి డబుల్‌ మ్యూటెంట్‌ వైరసే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలు గుర్తించారు. డబుల్‌ మ్యూటెంట్‌ చాపకింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

రాష్ట్రంలో విద్యాసంస్థలు, సర్వీసుల్లో వెనకబడిన కులాల(ఏ,బీ,సీ,డీ,ఈ)కు రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 2031 మే 31 వరకు వీటిని వర్తింపజేస్తారు. ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని.. పిల్లలు, భవనాలు, ఉపాధ్యాయులతో సహా అప్పగిస్తే పేరు మార్చకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహించనుంది. అప్పగించడానికి యాజమాన్యాలు ఇష్టపడకపోతే.. ఎయిడెడ్‌ పోస్టుల్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి పూర్తిగా ప్రైవేటు కళాశాలలుగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాల ప్యాకెట్ల కంటే ముందే మద్యమా..?: లోకేశ్

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ద‌శ‌ల‌వారీ మ‌ద్యనిషేధమని.. దశ‌ల‌వారీ అమ్మకం వేళ‌లు మార్చారని ధ్వజమెత్తారు. పాల ప్యాకెట్ల స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిస్తే ఏమనుకోవాలని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్​డౌన్!

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్​డౌన్ లేదా ఆ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఏఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు అమలవుతున్నాయో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • మహాత్ముడి వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత

మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలు అందించిన వీ కల్యాణం కన్నుమూశారు. 1943 నుంచి 1948 వరకు గాంధీకి ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాహనాదారులకు షాక్​- రెండో రోజూ పెట్రో మోత

దేశంలో మళ్లీ పెట్రో బాదుడు షురువైంది. వరుసగా రెండో రోజూ (బుధవారం) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, డీజిల్ ధర లీటర్​కు​ 21 పైసలు పెరిగాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లండన్​లో జైశంకర్ వరుస సమావేశాలు

జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం లండన్​కు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్.. వివిధ దేశాల ప్రతినిధులు, మంత్రులతో వరుస చర్చలు జరిపారు. ఐరోపా సమాఖ్య ప్రతినిధితో సమావేశమైన ఆయన.. అఫ్గాన్​లో శాంతి స్థాపనపై చర్చించారు. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతోనూ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఐపీఎల్​ నిరవధిక వాయిదాను అర్థం చేసుకోగలం'

ఐపీఎల్​ నిరవధిక వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్​ అసోసియేషన్​ స్పందించాయి. లీగ్​ను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని అర్థం చేసుకోగలమని పేర్కొన్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'పుష్ప'రాజ్​ జోరు తగ్గడం లే!

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'పుష్ప'. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడా వీడియో యూట్యూబ్​లో 60 మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details