ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

.

top news
టాప్ టెన్ న్యూస్

By

Published : Apr 27, 2021, 9:01 AM IST

  • చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- నేడే ప్రారంభం
    చిన్నారుల వినోదానికి సరికొత్త వేదికను తీసుకురానుంది ఈటీవీ నెట్​వర్క్​. 'బాలభారత్​' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. ఛానళ్లను మంగళవారం ఒకేసారి ప్రారంభిస్తోంది. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్ని విభిన్నంగా ఆవిష్కరించనున్న బాలభారత్​.. ఈటీవీ ప్రస్థానంలో మరో కలికితురాయిగా నిలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో జాప్యం.. వారం తర్వాత కూడా రాని ఫలితాలు
    కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో ఆలస్యం.. అనుమానిత లక్షణాలున్నవారిని కలవరపెడుతోంది. నమూనాలిచ్చి ఏడెనిమిది రోజులైనా.. ఫలితాలు నిర్ధరణ కాకపోవడం.. ఆందోళన పెంచుతోంది. ఈలోగా పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది బయట తిరుగుతూ వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాష్ట్రానికి పొంచి ఉన్న ఆక్సిజన్ సమస్య!
    రాష్ట్రానికి ఆక్సిజన్ సమస్య పొంచి ఉంది. అవసరాలకు తగ్గట్లు సరఫరా కాకపోవడంతో భవిష్యత్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా... ఆక్సిజన్‌ నిల్వలు పెంచుకోకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఎలక్టోరల్​ మోసం వల్లే అక్కడ భాజపాకు..ఇక్కడ వైకాపాకు అన్ని సీట్లు: చింతా మోహన్
    తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక సందర్భంగా 3.5 లక్షల దొంగ ఓట్లు పోలైనట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యుసీ) ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ చింతామోహన్‌ ఆరోపించారు. దొంగ ఓటరు కార్డులను సృష్టించడమే కాకుండా అన్నీ అక్రమంగానే జరిగాయన్నారు. 2019 ఎన్నికల్లోనూ ఎలక్టోరల్​ మోసం వల్లే కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపాకు అన్ని సీట్లు వచ్చాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • నవ దంపతులకు ఎస్పీ ఇంట్లో విందు ఆఫర్​
    కరోనా కేసులు పెరుగుతోన్న వేళ.. వైరస్​ వ్యాప్తిని తగ్గించడానికి వినూత్న ఆలోచన చేశారు ఓ పోలీసు ఉన్నతాధికారి. నూతన వధూవరులకు ఆయన 'డిన్నర్​ పార్టీ' ఇస్తున్నారు. అయితే అందుకు పెళ్లి వేడుకలో 10 మందిలోపు అతిథులుండాలని షరతు విధించారు. ఇంతకీ ఈ కథేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
  • సియాచిన్​లో ఇద్దరు సైనికులు మృతి
    జమ్ము- కశ్మీర్​లోని సియాచిన్​లో హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత్​కు బాసటగా విదేశాలు- వైద్య పరికరాలు సరఫరా
    కరోనా ఎదుర్కొనేందుకు విదేశాలు.. భారత్​కు మద్దతుగా నిలిచాయి. ఫ్రాన్స్​, కువైట్​, బ్రిటన్​ సహా పలు దేశాలు తమ వంతు సాయంగా ఆక్సిజన్​తో పాటు ఇతర వైద్య పరికరాలు అందచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'కరోనా 2.O వల్ల రెండంకెల వృద్ధి రేటు కష్టమే!'
    కరోన రెండో దశ విజృంభణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఈ సారి కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న మినీ లాక్​డౌన్​లు, ఇతర ఆంక్షల కారణంగా వృద్ధి రేటు 2021-22లో 10 శాతంలోపే నమోదవ్వచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'ఈ విజయంలో మా బౌలర్లదే కీలకపాత్ర!'
    ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ రెండో విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ జట్టు కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​. పంజాబ్​పై విజయంలో తమ బౌలర్లు కీలకపాత్ర పోషించారని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వారి ఆకలి తీరుస్తున్న సల్మాన్ ఖాన్​​
    కరోనా పరిస్థితుల్లో ఎంతో మంది సినీప్రముఖులు తమకు చేతనైన సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఉన్నవాళ్లకు ఆహారాన్ని అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details