- రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- నూజివీడులో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆరుగురు మృతి
కృష్ణా జిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో.. ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పేద, మధ్య తరగతులపై ధరల భారం
ఇంటి ఖర్చు తడిసిమోపెడవుతోంది. అటు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్.. ఇటు నిత్యావసరాల ధరలు పరుగులు తీస్తున్నాయి. వంట నూనెలైతే భగ్గుమంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏకంగా 67% పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా పామాయిల్ ధర రూ.120 అయింది. వేరుసెనగ నూనె చుక్కలకేసి చూస్తూ.. రూ.165కి చేరింది. ప్రధానమైన పప్పుధాన్యాల్లో సెనగ మినహా మిగిలినవన్నీ 30% వరకు పెరిగాయి. కొన్నిరకాల సబ్బుల ధరలూ పెరిగాయి. కరోనాతో ఆదాయం అసలే అంతంతమాత్రంగా ఉందంటే.. ఇంటి ఖర్చులు సగటున 35% వరకు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మహిళా న్యాయమూర్తుల కొరత ఆందోళనకరం'
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో కేవలం ఒక మహిళా జడ్జి ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. న్యాయవృత్తిలో మహిళల ఎదగుదలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్న కార్లకు మళ్లీ గిరాకీ!