ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

9 am top ten news
టాప్ టెన్ న్యూస్

By

Published : Mar 11, 2021, 8:59 AM IST

  • రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు

రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలలో వేచి చూస్తున్నారు. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?

శక్తిమంతుడైన పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా. మరే ఇతర రూపాలు ఆయనకు లేవా.. అంటే జగత్తంతా తానే నిండిన స్వామికి ఎన్నో అవతారాలు.. మరెన్నో రూపాలున్నాయని శైవాగమాలు ప్రకటిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడు అవతరించిన రూపాలు సుమారు 175 వరకు ఉన్నాయని చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు

విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉద్ధృతం చేసే దిశగా కార్మిక సంఘాలు కార్యచరణ రూపొందిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమూ దూకుడు పెంచాలని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కార్పియో పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత

పాకిస్థాన్​ నుంచి భారత్​కు చేరుకుని.. కన్నవారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగురాలు గీత కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో తన తల్లిని ఆమె కలుసుకుంది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గీత తల్లిదండ్రుల జాడ తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సైనిక తిరుగుబాటుపై భారత్ ఆందోళన

మయన్మార్​లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. కాగా, మయన్మార్ సైనిక నిర్బంధంలో మరో రాజకీయ నేత మరణించారు. తీవ్రంగా హింసించడమే మరణానికి కారణమని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లోయలో పడ్డ బస్సు- 26మంది యాత్రికులు మృతి

ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జావా ద్వీపంలో ఓ యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 35మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టోక్యోనే నా చివరి ఒలింపిక్స్​: మేరీ కోమ్​

టోక్యో వేదికగా జరిగేదే​ తన చివరి ఒలింపిక్స్​ అని భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్​ వెల్లడించింది. వయసు పరిమితి కారణంగా తదుపరి ప్యారిస్​ ఒలింపిక్స్​కు​ దూరం కాక తప్పదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విక్రమ్​ సినిమా నుంచి అనిరుధ్ ఔట్

తమిళ స్టార్ హీరో చియాన్​ విక్రమ్​, ఆయన తనయుడు ధృవ్​ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా నుంచి సంగీత దర్శకుడు అనిరుధ్​ తప్పుకొన్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి మరో మ్యూజిక్​ డైరెక్టర్​ సంతోష్​ నరాయణ్​ను స్వరాలు సమకూర్చనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details