- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- నిరసనలు కొనసాగుతున్నా.. అమ్మకానికి అడుగులు !
విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా.. పరిశ్రమ ఉన్నతాధికారులు మాత్రం విక్రయ ప్రక్రియలో అడుగులు ముందుకేస్తున్నారు. పరిశ్రమకు నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెంతో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మధార ప్రాంతానికి చేరువలో ఉన్న 22.19 ఎకరాల భూమి అప్పగింతకు రంగం సిద్ధం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రూ.400 ఆదాయంతో ప్రారంభమై..నగర పాలక సంస్థ స్థాయికి చేరి..
అక్కడ వందేళ్ల క్రితమే.. పారిశుద్ధ్య విధానం అమలైంది. ఆనాడే.. ప్రతి వీధికీ కుళాయి ఉంది. అప్పుడు ఏడాది ఆదాయం.. రూ.400గా ఉండేది.. ఇప్పుడు రూ.36 కోట్లకు చేరింది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి చేరి తొలి ఎన్నికలకు వెళ్తోంది. అదే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్. మెుదటి నుంచి ఇప్పటి వరకూ.. విజయనగరం కార్పొరేషన్‌గా ఎలా అవతరించిందో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా కుటుంబసభ్యులతో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్-నేపాల్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం!
భారత్, నేపాల్ మధ్య ఈ నెల 17న ఉన్నత స్థాయి అధికారుల భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు దేశాల ప్రాదేశిక యంత్రాంగాల మధ్య జరగబోతున్న 8వ సమావేశం ఇది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై ఈ భేటీలో చర్చించినున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాలో కొత్త ఉత్పరివర్తనలు, ప్రొటీన్లు గుర్తింపు
కరోనా వైరస్ ఉత్పరివర్తన తీరు, దానికి సంబంధించిన ప్రొటీన్ల వివరాలను గుర్తించడం చాలా ముఖ్యం. అవి గుర్తిస్తేనే దాని వల్ల కలిగే వ్యాధులను నయం చేసేందుకు టీకా, ఇతర మందులను కనుగొనేందుకు వీలవుతుంది. తాజాగా ఈ వైరస్‌కు సంబంధించి అనేక పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్తలు.. ప్రత్యేక ప్రొటీన్లను గుర్తించారు. తరువాతి పరిశోధనలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2021లో చైనా జీడీపీ టార్గెట్ ఎంతంటే..?
చైనా.. ఈ ఏడాదిలో 6 శాతానికిపైగా వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. గతేడాది కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సానుకూల వృద్ధి నమోదు చేసింది చైనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవాగ్జిన్ కొనుగోలుకు ఫ్రాన్స్ ఆసక్తి
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కు చెందిన 'కొవాగ్జిన్' టీకా కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మనదేశంలోని ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లేనేయిన్ ఇటీవల హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లను కలిశారు. సమీప భవిష్యత్తులో టీకా సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వికెట్ల వేటలో దూసుకెళ్తున్న అక్షర్
జడేజా గైర్హాజరీతో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్.. టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. గులాబి టెస్టులో ఏకంగా 11 వికెట్లు తీసుకున్న ఈ గుజరాతీ స్పిన్నర్.. ప్రస్తుత టెస్టులోనూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. తనది గాలివాటం కాదని నిరూపిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మొదట నుంచి చిన్న కన్ఫ్యూజన్ ఉండేది: నవదీప్
కథల ఎంపికలో తొలి నుంచి తనకు చిన్న కన్ఫ్యూజన్ ఉండేదని చెప్పిన నవదీప్.. ప్రస్తుతం ఆ విషయాన్ని చాలావరకు అధిగమించానని అన్నారు. ఈయన నటించిన 'మోసగాళ్లు' త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.