ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - తెలుగు వార్తలు

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ టెన్ న్యూస్

By

Published : Feb 23, 2021, 9:00 AM IST

  • పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం

రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం జరుగుతోంది. వారం రోజులే గడువున్నా 39.67శాతమే పనులు పూర్తియ్యాయి. ఫర్నీచర్‌ సరఫరా 4.41శాతమే జరిగింది. పనుల పెండింగ్‌ వల్ల కొన్నిచోట్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు నేడు తుది గడువు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు నేటితో ముగియనుంది. సోమవారం మొత్తం 14 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 10,536 పంచాయతీల్లో గెలుపొందాం: వైకాపా

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. 10,536 గ్రామ పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురం వద్ద.. బొలేరో చెట్టును ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందగా.. 20మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 8మంది మృతి

బిహార్​ కటిహార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్సిలా ప్రాంతంలో ట్రక్కు- కారు ఢీకొనడం వల్ల 8మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోదీ పాల్గొనే వెబినార్​కు 'కిన్నాల్​' కళాకారులు

వైవిధ్యాలకు నెలవైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి. అనాదిగా వస్తోన్న ఈ కళల్లో ప్రతీది ప్రత్యేకమే. వీటన్నింటిలో కర్ణాటక కొప్పల్ జిల్లాలోని 'కిన్నాల్ హస్తకళ'ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. ప్రపంచానికి అందమైన బొమ్మలను అందిస్తున్న ఈ నైపుణ్యం అంతర్జాతీస్థాయిలో గుర్తింపు పొందనుంది. దిల్లీ వెబినార్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శిరోజాల అక్రమ రవాణాపై కేంద్రం ఉక్కుపాదం

శిరోజాల అక్రమ రవాణాపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఏటా రూ.8 వేల కోట్ల విలువైన మానవ వెంట్రుకలను ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్​, తిరుచ్చి, చెన్నై, కోల్​కతా కేంద్రాలుగా ఎగుమతుల దందా జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మార్స్​పై రోవర్‌ దిగిన అద్భుత దృశ్యాలు

అంగారక గ్రహంపై వ్యోమనౌక 'పర్సెవరెన్స్'​ కాలుమోపిన అద్భుత వీడియోను విడుదల చేసింది నాసా. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో అరుణ గ్రహం ఉపరితలంపై ల్యాండ్​ అయిన క్షణాలు రికార్డయ్యాయి.ఈ దృశ్యాలను మీరూ చూసేయండి.

  • స్నేహిత్‌ సంచలనం.. సీనియర్‌ టీటీలో పతకం ఖాయం

జాతీయ సీనియర్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​లో తెలుగు కుర్రాడు ఎస్​ఎఫ్​ఆర్​ స్నేహిత్​ మెరిశాడు. పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో సుష్మిత్​ శ్రీరాంపై నెగ్గి, సెమీస్​కు చేరిన స్నేహిత్​.. దాదాపుగా పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'టైటానిక్‌'కు మరో ముగింపు: వీడియో వైరల్‌

ప్రపంచ సినిమా చరిత్రలో 'టైటానిక్'​ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. భాష, దేశాలతో సంబంధం లేకుండా ఈ అపురూప ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ చిత్ర ముగింపు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే టైటానిక్​కు సంబంధించిన మరో క్లైమాక్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారింది. ఆ వీడియో చూడాలంటే క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details