- పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్
పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఓటింగ్... మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో 80.71% పోలింగు నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను తొందరగా ముగించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లెక్కింపైనా ఫలితాలు ప్రకటించట్లేదు : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు కొందరు అధికారులు లొంగిపోయారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఫలితాలు తారుమారు చేశారు... చర్యలు తీసుకోండి'
పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని... తెదేపా నేతలు ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ పేరిట ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 'స్వర్ణిమ్ విజయ్ దివస్' పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవాలలో పాల్గొననున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటకుల సందడి
సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. కరోనా లాక్డౌన్ అనంతరం.. తొలిసారి ఫిబ్రవరి 18 నుంచి పర్యటకులను అనుమతిస్తున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు 'మహాబాహు-బ్రహ్మపుత్ర'ను ప్రారంభించనున్న మోదీ