ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

టాప్ టెన్ న్యూస్

By

Published : Feb 10, 2021, 9:04 AM IST

top news
టాప్ టెన్ న్యూస్

  • పల్లె తీర్పు: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇవే..

పల్లె పోరు మెుదటి అంకం.. చెదురు మదురు సంఘనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సర్పంచి ఫలితాల వివరాలు తెలుసుకోవటం కోసం క్లిక్ చేయండి.

  • పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం..మొదటి విడతలో భారీ పోలింగ్

పల్లెల్లో చైతన్యాన్ని కరోనా ఆపలేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భారీ పోలింగ్ నమోదైంది. తొలిదశ ఎన్నికల్లో 81.42 శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పోలింగ్ శాతంపై ఎస్​ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, కడప మినహా మిగిలిన జిల్లాల్లో 80 శాతంపైగా పోలింగ్ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పల్లెపోరు: ఫలితాల వెల్లడి సమయంలో పలుచోట్ల ఉద్రిక్తతలు

పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన సందర్భంగా చాలాచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్వల్ప తేడాలతో ఓడిపోయిన అభ్యర్థులు రీకౌంటింగ్‌ కోసం పట్టుబట్టారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఆందోళనలకు దిగారు. కొన్నిచోట్ల పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల సంఖ్యకు తేడా ఉండటం గందరగోళానికి కారణమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేటి నుంచే నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

నేటి నుంచి నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 12న తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పోలింగ్ జరుగునుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా భారత్‌!

భారత్​లో ఇంధన గిరాకీ తారస్థాయికి చేరుకునే ఆవకాశం ఉందని ఇంటర్నేషనల్​ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్​.. మరో రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారునిగా అవతరిస్తుందని అంచనా వేసింది. 2000 నుంచి ఇంధన వినియోగం రెట్టింపు అయ్యిందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉత్తరాఖండ్​ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు

ఉత్తరాఖండ్​లో సంభవించిన ఆకస్మిక వరదలకు కారణాన్ని శోధించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. అయితే వీటికి సంబంధించి రోజుకో ఆసక్తికర వార్తలు వెలువడుతుండుతున్నాయి. చైనా అణుసాంకేతికతను పసిగట్టేందుకు అమెరికా 1965లో నందా దేవి హిమానీనదంపై అణు పరికరాన్ని ఉంచిందని దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లి అన్నారు. ఈ పరికరమే చమోలి వరదలకు దారితీసిందంటున్నారు నాటి రహస్య మిషన్‌లో భాగమైన కోహ్లి. ఈ వాదనను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ ప్రొటీన్ లోపం వల్లే ఐరోపాలో కరోనా ఉద్ధృతం'

ఐరోపా, ఉత్తర అమెరికా ప్రజలు ఎక్కువగా కరోనా బారినపడడానికి కారణం ఊపిరితిత్తులకు రక్షణ కల్పించే ప్రొటీన్ లోపమే అని తాజా పరిశోధనలో తేలింది. బంగాల్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్​కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్రంప్ అభిశంసన: సెనేట్​లో ఆరుగురు రిపబ్లికన్ల మద్దతు

అగ్రరాజ్యంలోని సెనేట్​లో మాజీ అధ్యక్షుడు ట్రంప్​ అభిశంసనపై విచారణ వీడియో ప్రదర్శనతో అధికారికంగా ప్రారంభమైంది. అయితే... విచారణను రాజ్యాంగబద్ధంగా నిలిపివేసేందుకు యత్నించిన ట్రంప్​ బృందం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు రిపబ్లికన్లు... డెమొక్రాట్లకు మద్దతుగా నిలవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టూ కోరుకోదు'

ఎస్జీ బంతుల నాణ్యత సరిగా లేదంటూ గతంలో అశ్విన్​ చేసిన అభిప్రాయాన్నే.. తాజాగా భారత కెప్టెన్​ కోహ్లీ వ్యక్తం చేశాడు. వీటికంటే కూకబురా లేదా డ్యూక్​ బంతులే బాగున్నాయని తెలిపాడు. టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందస్తు బెయిల్​ కోసం హైకోర్టుకు సన్నీ లియోనీ

చీటింగ్ కేసు విషయమై కేరళ హైకోర్టుకు వెళ్లింది నటి సన్నీ లియోనీ. ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకుంది. తనపై ఫిర్యాదు చేసిన ఈవెంట్ మేనేజర్ అసత్యాలు చెబుతున్నాడని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details