- నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రక్రియ నేటి నుంచి అమలు కానుంది. తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బందికి మాత్రమే పరిమితమైన వ్యాక్సినేషన్.. రెండో విడతలో మరిన్ని శాఖల సిబ్బందికి వేయనున్నారు. రెండో విడత టీకాల కోసం 5 లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంచాయతీ ఎన్నికలు... దొడ్డిదారిలో ఏకగ్రీవాలు!
ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకు, ప్రతిపక్ష మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అధికారపార్టీ నేతలు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. మొదట నచ్చజెబుతున్నారు.. ఆ తర్వాత బెదిరిస్తున్నారు. అప్పటికీ వినకపోతే కొన్నిచోట్ల భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. ఉపాధి హామీ బిల్లులు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పదవులు పంచుకుందామంటూ బేరాలు ఆడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్నికల నిర్వహణపై నిఘా వ్యవస్థ: ఎస్ఈసీ
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీకి ఉన్న అభిప్రాయాన్ని అత్యంత సుస్పష్టంగా చెప్పినా....కొందరు పెడార్ధాలు తీస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడం శ్రేయస్కారం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు నిఘా యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంగళగిరి ఎయిమ్స్’కు ఇసుక సమస్య!
ఇసుక సమస్యతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యం జరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనాచౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!
నువ్వలరేవు.. మత్స్యకారుల గ్రామం. ఇక్కడ గత 70 ఏళ్లలో ఎప్పుడూ పంచాయతీ పోరు జరగకపోవడం విశేషం. ఎన్నికల వేళ స్థానిక బృందావతి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు సమావేశమై.. రిజర్వేషన్‌కు అనుగుణంగా సర్పంచి, ఎంపీటీసీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. వారితోనే నామినేషన్ వేయిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ టీకాపై సంకోచమే అసలు సమస్య