ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ap news

ప్రధాన వార్తలు @ 9 AM

9 am top news
ప్రధాన వార్తలు

By

Published : Feb 1, 2021, 9:00 AM IST

  • సంక్షోభ కాలంలో కోటి ఆశలతో బడ్జెట్​

కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కరోనా సృష్టించిన సవాళ్ల సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వార్షిక పద్దు ఆర్థిక టీకా కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల 45 నిమిషాల వరకు తరగతులు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన ఆదివారం నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ప్రక్రియ ముగియాల్సి ఉన్నా.. పలుచోట్ల అర్ధరాత్రి దాటినా నామినేషన్లు స్వీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర.. విధ్వంసాలకు వేదికవడం బాధాకరం'

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కత్తులు, గొడ్డళ్లతో వైకాపా నాయకులు రోడ్లపై స్వైరవిహారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర.. ఇప్పుడు విధ్వంసాలకు వేదిక కావడం బాధాకరమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సర్పంచికే ఉంటుంది.. చెక్​ 'పవర్'..!

రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా.. పంచాయతీ ఎన్నికల మాటే..! ఈ ఎన్నికల గురించి... పల్లెలో ఉన్న నన్ను.. పట్నంలో ఉన్న నా మిత్రుడు అడిగాడు.. పార్టీ గుర్తుల మీద జరగని ఈ ఎన్నికలకు ఎందుకింత క్రేజ్ అని. ఊళ్లోనే ఉండే సర్పంచి పదవికి ఎందుకీ పోటీ అని..? నా మిత్రుడి లాగే చాలామందికి తెలియదు కదా.. సర్పంచికి ఉండే 'పవర్​' ఎంటో..! ఒక్కసారి చూద్దాం పంచాయతీ ఎన్నికలకు, సర్పంచి పదవికి ఎందుకింత ప్రాధాన్యతో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • రక్షణ రంగానికి సౌరశక్తి.. సర్వ విధాలుగా ఉపయుక్తం

రక్షణ విభాగంలోని కంటోన్మెంట్‌ ప్రాంతాలు, వైమానిక స్థావరాలు, నేవీలో సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది కేంద్రం. ఇప్పటికే గ్రీన్​లదాఖ్​ లక్ష్యంగా సౌర పార్కును ప్రకటించారు ప్రధాని మోదీ. 7500 మెగావాట్ల సామర్థ్యంతో 2023 నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్వవిధాలుగా ఉపయుక్తంగా ఉండేలా.. సౌరశక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మేం రైతులం.. ఎదురుచూపులు మాకు అలవాటే!'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తోన్న ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. గాజీపుర్ సరిహద్దు​కు పెద్దఎత్తున తరలివస్తున్నారు కర్షకులు. పంటల కోసం సుదీర్ఘకాలం వేచిచూసే తాము.. ఉద్యమం ఫలించే వరకూ ఎంతకాలమైనా దీక్షలు ఆపేదిలేదని తేల్చి చెబుతున్నారు. 'జై జవాన్​.. జై కిసాన్'​ నినాదాలతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సైనిక నియంత్రణలో మయన్మార్​- సూకీ గృహ నిర్బంధం

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశం తమ నియత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. మయన్మార్​ అధినేత్రి, నేషనల్​ లీగ్ ఫర్​​ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్​ సాన్​ సూకీని సైన్యం గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని నేపిడాలో ఫోన్​, ఇంటర్​నెట్​ సేవలు రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆలస్యంగా వస్తానన్నాడు.. తీసేశారు!

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్​ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కోల్పోయాడు సీనియర్ పాక్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్. రెండు రోజులు ఆలస్యంగా బయోబబుల్​లో చేరతానని హఫీజ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ అతడిని సెలక్షన్​కు దూరంగా పెట్టింది సెలక్షన్ కమిటీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రణ్​వీర్​లో నచ్చిన విషయమదే.. అందుకే పెళ్లి చేసుకున్నా'

బాలీవుడ్​లో స్టార్​ కపుల్​గా పేరుతెచ్చుకుంది రణ్​వీర్-దీపిక జోడీ. అయితే తాను రణ్​వీర్​ను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది దీపిక. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details