- మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు
పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎస్ఈసీ అవకాశం కల్పిస్తుంది. మధ్యాహ్నం తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హోరెత్తిన పురపోరు.. ప్రచార బరిలో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు
పుర పోరులో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు ఓట్ల వేటలో మునిగిపోయారు. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున ప్రచారంలో పాల్గొన్న ముఖ్యనేతలు.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రత్యర్థులకు కంట పడకుండా.. రహస్య ప్రదేశాలకు తెదేపా అభ్యర్థులు!
సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్ ముగిశాక రెండు పార్టీలు దాదాపు సమానంగా సీట్లు గెలుచుకుంటే.. పార్టీ ఫిరాయిస్తారన్న భయంతో సీఎం ఎన్నికో, ఛైర్మన్ ఎన్నికో పూర్తయ్యే వరకూ శిబిర రాజకీయాలు నిర్వహించడం చూశాం. ఇప్పుడు పురపాలక ఎన్నికల్లో విపక్షాలు నామినేషన్ల ఉపసంహరణ దశలోనే తమ అభ్యర్థులతో శిబిరాలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు తీవ్రమవడంతో.. వారిని కాపాడుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం తెదేపా అనేక తంటాలు పడుతోంది. తమ అభ్యర్థుల్ని రహస్య ప్రదేశాలకు పంపించింది. కొన్నిచోట్ల అభ్యర్థులతో తెదేపా నాయకులు టచ్‌లో ఉంటూ.. వేయికళ్లతో కాపు కాస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గన్నవరం విమానాశ్రయంలో ఆలస్యంగా విమాన సర్వీసులు
గన్నవరం విమానాశ్రయంలో ఆలస్యంగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం
శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న వేళ బంగాల్‌లో రాజకీయ పార్టీలన్నీ అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా బంగాల్‌లో మతతత్వ రాజకీయాలు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త పార్టీల నమోదుపై అభ్యంతరాల గడువు కుదింపు