ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - Top News @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

top news
ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jan 7, 2021, 9:06 AM IST

  • రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్​ భవనం

రిపబ్లికన్​ మద్దతుదారుల ఆందోళనతో అమెరికా క్యాపిటల్​ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ​ మద్దతుగా క్యాపిటల్​ వద్ద నిరసన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంత మంది పోలీసులపై పెప్పర్​ స్ప్రే చల్లారు. ఈ క్రమంలో నిరసనకారులను నిలువరించేందుకు తుపాకుల మోత మోగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా ఆందోళనలపై ప్రపంచ దేశాల అసహనం

అమెరికా కాంగ్రెస్​ సమావేశం సందర్భంగా.. క్యాపిటల్​ భవనం వద్ద ట్రంప్​ మద్దతుదారులు సృష్టించిన హింసను.. బ్రిటన్, ఐరోపా సహా పలు దేశాలు తప్పుపట్టాయి. శాంతియుతంగా అధికార బదిలీ చేపట్టాల్సిన తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏవీ సుబ్బారెడ్డికి 41సీఆర్​పీసీ కింద నోటీసులు

సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మరోవైపు భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రామతీర్థం ఘటనలో కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నాం: డీజీపీ

రామతీర్థం ఘటన వెనక కుట్రకోణం ఏమైనా ఉందా? అనేది పరిశీలిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆ దిశగా లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్గానిక్‌ మందుల పేరుతో అడ్డగోలు దోపిడీ.. ఆపేవారేరీ?

ఆర్గానిక్ మందుల పేరుతో రాష్ట్రంలో మోసాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆర్గానిక్‌ మందులంటూ కొందరు, జీవ రసాయనాలు అంటూ మరి కొందరు విచ్చలవిడిగా ఉత్పత్తులు తయారు చేసి అందిన కాడికి రైతుల్ని దోచుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సశక్త దేశానికి ఘన ప్రతీక మన పార్లమెంట్​

భారత పార్లమెంటు విశిష్టతను పదిలంగా కాపాడుకుంటూనే దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం నాటికి కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి మోదీ సర్కారు సంకల్పించింది. సవరించిన అంచనాల మేరకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ పరిమాణం దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలు కాగా, ప్రతిష్ఠాత్మక పార్లమెంటు భవనం కోసం వెయ్యికోట్లు వ్యయీకరిస్తే తప్పు పట్టాల్సిందేముంది? పార్లమెంటు సభ్యుల సంఖ్య స్థిరీకరణ 2026తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం 888 మంది సభ్యుల్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభను తీర్చిదిద్దుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హాకీలో దేశానికి 27 పతకాలు తెచ్చిపెట్టింది ఆ ఊరే

భారత్‌కు 14 మంది ఒలంపిక్ ఆటగాళ్లను అందించిన ఊరది. మనదేశానికి 27పతకాలు సాధించిపెట్టిన ఆటగాళ్లను పెంచిన గ్రామమది. హాకీ మక్కాగా పేరుపొందిన ఈ ఊరు.. క్రీడాకారులకు ప్రస్తుతం సరైన ఆట మైదానం అందించడంలో వెనబడుతోంది. భారత హాకీని ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఈ ఊరి మైదానం కీలకపాత్ర పోషించింది. ఇంతకీ ఆ ఊరేది? దాని చరిత్ర ఏంటి? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • కొవిడ్‌ కల్లోలంలో బర్డ్‌ ఫ్లూ కలకలం

కరోనా మహమ్మారితో ఇప్పటికే దేశం అతలాకుతలమై అల్లాడుతుంటే.. బర్డ్​ ఫ్లూ కోరలు చాస్తూ.. పౌల్ట్రీ పరిశ్రమకు పెనుసవాళ్లు విసురుతోంది. 15 ఏళ్ల క్రితమే దేశంలోకి విస్తరించిన ఈ వైరస్.. ఇప్పటికే 28సార్లు పంజా విసిరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్​ ఫ్లూతో 4 రాష్ట్రాల పరిధిలో వేలాదిగా పక్షులు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో కాకులు.. హిమాచల్​ ప్రదేశ్​, కేరళల్లో బాతులు ఎక్కువగా చనిపోయాయి. ఈ నేపథ్యంలో కోళ్ల రైతులు, వ్యాపార వర్గాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గురించి అవగాహన పెంచడం సహా.. వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సచిన్​ వందో సెంచరీ.. రైనాతో ఆసక్తికర వ్యాఖ్యలు

దిగ్గజం సచిన్.. శతశతకాలతో ఎవరికీ సాధ్యమవని రికార్డు నెలకొల్పారు. అయితే ఆ ఘనత సాధించాక క్రీజులో తనతో పాటు బ్యాటింగ్​ చేస్తున్న రైనాతో మాస్టర్​ ఏమన్నాడంటే? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • 'వకీల్​సాబ్' క్లైమాక్స్ ఫైట్ ఫొటోలు లీక్!

పవన్​ కొత్త సినిమా క్లైమాక్స్​ ఫైట్​ ఫొటోను నటుడు దేవ్​గిల్​ తన ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details