- అప్పుల్లో, ఖర్చుల్లో ఏపీదే తొలిస్థానం.. కాగ్ లెక్కల్లో వెల్లడి
దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే... ఆంధ్రప్రదేశ్ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం.. అప్పుల రూపంలోనే సమీకరించినట్లు కాగ్ గణాంకాలు తేల్చాయి. ప్రతి వంద రూపాయల ఖర్చులో 51 రూపాయలు రుణాల ద్వారా తెచ్చుకున్నవేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు ఏపీ దరిదాపుల్లో కూడా లేవు. అటు బడ్జెట్ అంచనాల మేరకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నదీ మన రాష్ట్రమేనని గణాంకాలు చెబుతున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం
రాష్ట్రంలో దాదాపు వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నేడు ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు దశల్లో సమగ్ర భూ సర్వే చేపట్టి.. 2023 జనవరి నాటికి రాష్ట్రమంతటా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలి దశ నేటి నుంచి ప్రారంభం కాగా.... సర్వే పూర్తవగానే రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వైరస్ స్ట్రెయిన్‌పై అత్యవసర భేటీ!
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. ఈ విషయమై చర్చించేందుకు కొవిడ్-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని(జేఎండీ) అత్యవసర సమావేశానికి పిలిచింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు ఆకాశంలో అద్భుతం..397 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు !
వినీలాకాశంలో మునుపెన్నడూ చూడని మహా కలయిక నేడు ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహాలైన గురు-శని అత్యంత సమీపంలోకి రానుండటంతో ఆ రెండూ కలిసినట్లుగా ఆకాశంలో ఏర్పడే అద్భుతం వీనుల విందు చేయనుంది. ఒకటి కాదు.. రెండు కాదు అక్షరాల 397 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరకు వచ్చినట్లు కనిపించనున్నాయి. అందుకే దీనిని ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రేట్ కంజంక్షన్ (మహా కలయిక)గా అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మారని సఫాయీ కర్మచారుల జీవనం- ఎవరిదీ నేరం?