ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

9 am top news
ప్రధాన వార్తలు 9 AM

By

Published : Dec 16, 2020, 9:02 AM IST

  • భగ్గుమంటున్న వంట గ్యాస్...నెలలోనే సిలిండర్‌పై రూ.100 పెంపు

వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గ్యాస్ గుదిబండలా మారుతోంది. రాష్ట్రంలో వంట గ్యాస్‌ ధరలు నెల వ్యవధిలోనే రూ.100 వరకు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం'

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేపట్టే అవకాశం ఉన్నందున ఆ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. మొదటి దశ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు వేచి చూసేలా ఎస్​ఈసీని ఆదేశించాలని అఫిడవిట్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌పై ప్రభుత్వం అఫిడవిట్‌

ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆస్తుల వేలం కేసుల్లో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జగ్గయ్యపేటలో వృద్ధ దంపతుల హత్య..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో వృద్ధ దంపతుల హత్యకు గురయ్యారు. మృతులు పాట ముత్తయ్య(62), అతని భార్య సుగుణమ్మగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తాగునీరు విషతుల్యం- భారలోహాలతో కలుషితం!

శరీరంలోని అవయవాలు పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేయాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు అవసరం. అయితే మనం తాగే నీరు పరిశుభ్రంగా కూడా ఉండాలి. కానీ దేశంలో వేలకొద్దీ గ్రామాలు సాధారణ నీటి వసతికీ దూరంగానే ఉన్నాయి. 2016 'వరల్డ్‌ వాటర్‌ ఎయిడ్‌' నివేదిక ప్రకారం మనదేశంలో రక్షిత మంచినీటి లభ్యత అంతంత మాత్రమే. స్వచ్ఛమైన తాగునీరు లభించడం కూడా మహాభాగ్యంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యుద్ధనౌకల్లో బ్రహ్మోస్- రక్షణ శాఖకు ప్రతిపాదనలు

విస్తృత పరిధి గల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని యుద్ధ నౌకల్లో మోహరించాలని నావికాదళం నిర్ణయించింది. 38 క్షిపణుల కోసం రక్షణ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందుకోసం రూ. 1,800 కోట్లు ఖర్చు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వచ్చే అయిదేళ్లలో వంద కోట్ల మొబైల్​ ఫోన్లు'

వచ్చే అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా వంద కోట్ల మొబైల్​ ఫోన్లను తయారు చేయడంమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని సంకల్పించుకున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెరిపిన పడిన అమెరికా- ఇక బైడెన్​ సవాళ్ల సవారీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ విజయం ఇప్పటికే.. తేలినా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఠలాయింపుతో ఇంతకాలం రాజ్యమేలిన ప్రమాదకర ప్రతిష్టంభనకూ తాజాగా తెరపడింది. ఎలక్టోరల్‌ కాలేజీలోనూ బైడెన్‌ 306 ఓట్లు సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వర్ణ విద్వేషాల్ని రగుల్కొల్పి, అమెరికా సమాజాన్ని ట్రంప్‌ రెండుగా చీల్చిన వైనం- ఓటమి పాలైనా తనకు పోలైన రికార్డు స్థాయి ఓట్లలో స్పష్టమవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న బైడెన్​కు ఎదురవ్వనున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • పిచ్​ను కాదు.. బలాన్ని నమ్ముకోండి: కపిల్​ దేవ్​

డేనైట్​ టెస్టు​లో ఆసిస్​ జట్టుకే విజయావకాశాలు ఎక్కవగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి కపిల్​ దేవ్​. ఫ్లడ్​లైట్ల​ వెలుతురులో ఎలా ఆడాలో కంగారూల జట్టుకు బాగా తెలుసు అని చెప్పారు. ఆస్ట్రేలియా పిచ్​లపై పేస్​ బలాబలాల్ని అర్థం చేసుకుని టీమ్​ఇండియా బంతులు విసరాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'థియేటర్​ నుంచి నవ్వుకుంటూ బయటికొస్తారు'

సోలో బతుకు గురించి శ్లోకాలు వల్లెవేస్తున్నారు సాయితేజ్‌. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ తనకు సోలో లైఫే మేలు అంటున్నాడాయన. ఈ నెల 25న క్రిస్మస్‌ సందర్భంగా ఆయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్'​ సినిమా.. థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం విషయంలో సాయి తేజ్‌ ఎంత నమ్మకంగా ఉన్నారు? తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన మనసులో మాటేమిటి? నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లు తదితర విషయాలపై 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అవేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details