- నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బాయిలర్ యూనిట్‌లో వేడినీళ్లుపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేడి గొట్టం నుంచి వేడి నీరు పడి లక్ష్మణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమరావతి బృహత్ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
అమరావతి బృహత్ ప్రణాళికకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వారం రోజులు వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఇతర పిటిషన్లను కలిపి విచారించాలన్న ప్రభుత్వ తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు సర్వోన్నత న్యాయస్థానం.. అన్నింటినీ కలిపి విచారిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కన్నపేగు పారేసింది.. సమాజం చేరదీసింది
కన్నపేగు తనను ఎందుకు వద్దనుకుందో ఆ పసికందుకు తెలీదు.. అక్కడ తుప్పల్లో ఎవరు పడేశారో కూడా తెలియదు. తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని చేసిన ఆర్తనాదం ఆటుగా వెళ్తున్న వారి చెవిన పడటంతో ప్రాణాలతో బయట పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే.. 10 నుంచి 50 రూపాయల వరకూ జరిమానా విధించాలని పేర్కొంది. వీటి అమలు పర్యవేక్షణ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు కూడా చేపట్టాలని సూచించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్ రోగులు మృతి
గుజరాత్ అహ్మదాబాద్‌లోని శ్రేయ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐసీయూ వార్డ్‌లో ఉన్న మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జమ్ముకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా