ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

.

By

Published : Dec 30, 2020, 8:59 AM IST

9 am top news
9 am ప్రధాన వార్తలు

  • విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. జిల్లాలోని గుంకలాంలో పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమరావతికి 20 ఎకరాలు ఇచ్చిన రైతు కన్నుమూత

అమరావతికి చెందిన మరో రైతు రామారావు... కన్నుమూశారు. మందడానికి చెందిన ఆయన.. తన 20 ఎకరాల భూమిని గతంలో రాజధాని నిర్మాణం నిమిత్తం అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్

ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. 'గీత దాటితే' తప్పవు బేడీలు!

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై పోలీసు కేసులు నమోదు చేయడం.. విచారణ పేరుతో స్టేషన్లకు, కోర్టులకు తిప్పడం పరిపాటిగా మారింది. ఇవే కాదు.. కొంతమందిపై భౌతిక దాడులూ జరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్య.. ఈ పరంపరలో తాజా ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కర్ణాటక 'పంచాయతీ' కౌంటింగ్ షురూ

కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. బీదర్ జిల్లా మినహా ప్రతి చోట బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించింది ఈసీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎందరినో రక్షించి.. మానవత్వానికి ప్రాణం పోసి!

హరియాణా కురుక్షేత్రకు చెందిన పర్​గట్​ సింగ్​.. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. స్థానికంగా ఉన్న కాలువలో పడిపోయిన వారిని రక్షించడం సహా ఎన్నో వేల మృతదేహాలను వెలికితీశారు. కొన్నికొన్ని సార్లు ఆ మృతదేహాలను ఆయనే స్వయంగా ఖననానికి తరలిస్తారు. ఇలా నయాపైసా ఆశించకుండా సమాజానికి సేవ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు పర్​గట్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రైవేటీకరణకు ఎయిరిండియా- అదే బాటలో మరో ఆరు

భారత్​కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఎయిర్​ ఇండియా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ ఇప్పటికే పలువురు బిడ్లు దాఖలు చేయగా.. అర్హత కలిగిన వారి పేర్లను వచ్చేవారం వెల్లడించనున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్​దీప్​సింగ్​పురీ తెలిపారు. అయితే.. ఈ విషయంలో అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటరప్స్​ ఫండ్​ సంస్థ.. ఎయిర్​ ఇండియా రేసు నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రికార్డ్​ సృష్టించిన దక్షిణ కొరియా 'సూర్యుడు'

దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు 20సెకండ్ల పాటు 10కోట్ల డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతతో మండి.. సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కొరియన్​, సియోల్​ దేశాల పరిశోధకులు సంయుక్తంగా రూపొందించిన 'కె-స్టార్​(సూర్యుడి పేరు)'.. 2008లోనే సంచలనం సృష్టించగా.. వచ్చే ఐదేళ్లలో కనీసం 6 నిమిషాల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జడేజా సరికొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చోటు

'సర్' అంటూ సొంత జట్టు సభ్యులే ఎగతాళి చేయడం.. మరోవైపు అదృష్టం కలిసి వచ్చి టీమ్​లో కొనసాగుతున్నాడంటూ వచ్చిన విమర్శలు... అర కొరా ఆటగాడు అంటూ మాజీల సూటి పోటి మాటలు.. ఇవ్వన్నీ తట్టుకుని నిలబడిన భారత క్రికెట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. మెల్​బోర్న్ టెస్టుతో చాలా మందికి సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20.. ఈ మూడు ఫార్మెట్​లలో కనీసం 50 మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా జడ్డూ సరికొత్త శిఖరాలను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ మాత్రమే అందుకున్న ఈ మైలురాయిని పూర్తిచేసి దిగ్గజాల సరసన చేరాడు జడేజా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిర్మాతగా నటుడు సోనూసూద్​

నటుడు సోనూసూద్​ నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలతో ముందుకొస్తానన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details