- రాష్ట్రంపై కరోనా పడగ
రాష్ట్రంలో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 57 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలతో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పొలాల్లో భారీగా వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు గల్లంతయ్యారు, ఒక విద్యార్థి చనిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినీ ఫక్కీలో అల్లుడి హత్య... మామతో సహా 14 మందికి జైలు...
తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాడు మిర్యాలగూడలో ప్రణయ్‌ను మామ మారుతీరావు సుపారీ ఇచ్చి తుదముట్టించిన రీతిలోనే హైదరాబాద్‌లో గురువారం మరో పరువు హత్య జరిగింది. తమకు ఇష్టం లేకుండా కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుణ్ని కిరాయి మనుషులతో హత్య చేయించాడో తండ్రి. కుట్రలో భాగంగా తొలుత అమ్మాయి కుటుంబసభ్యులు వచ్చి మాట్లాడుకుందాం రండి అని నవదంపతులను నమ్మించి... కిరాయి మనుషులతో వాహనంలోనే హత్య చేయించాడు. పరువు కోసం జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ద్వారకా తిరుమల: స్వామివారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయుజ మాస కల్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి అమ్మవార్లు పెండ్లికుమారుడు కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఉభయదేవేరులతో కలిసి విశేష అలంకరణలో ఉన్న స్వామి వారిని భక్తులు కనులారా దర్శించి తరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశవ్యాప్తంగా 7 కోట్లు దాటిన కరోనా టెస్టులు
రోజూ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 75 శాతం పది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 7 కోట్లు దాటినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన భాజపా