ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - andhrapradesh update news

.

7 pm top news
7pm ప్రధాన వార్తలు

By

Published : Sep 25, 2020, 7:04 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 7,073 కరోనా కేసులు, 48 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 7,073 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బాలు నా ఆరో ప్రాణం.. దేవుడు ఇలా చేస్తాడనుకోలేదు: కె.విశ్వనాథ్

తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన నోట మాటలు రావడం లేదని.. ఇంత తొందరగా బాలు ఈ లోకాన్ని వదిలి వెళ్తాడనుకోలేదని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే

నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆబాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు...శాశ్వతంగా మూగబోయింది. కరోనాపై వెన్నెలకంటి రాసిన పాటను బాలు తనదైన శైలిలో పాడి ప్రజలను కరోనా బారిన పడకుండా ఉండాలంటూ అవగాహన కల్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రైతు భరోసా కేంద్రాల నుంచే పంట సేకరణ జరగాలి'

ఈ ఖరీఫ్​లో పండించిన పంటలన్నింటికీ కచ్చితంగా గిట్టుబాటు ధరలు వచ్చేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏ రైతుకూ ఇబ్బంది రాకూడదని స్పష్టం చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లద్దాఖ్​​లో 5.4 తీవ్రతతో భూకంపం

లద్దాఖ్​లో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. మధ్యస్థ తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై 5.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎస్పీ బాలు స్వరం అజరామరం'

సంగీత సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఆయన స్వరంతో అలరించారని కీర్తించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్యారిస్​లో మళ్లీ కత్తి దాడులు- నలుగురికి గాయాలు

ప్యారిస్​లో మరోసారి కత్తి దాడులు కలకలం సృష్టించాయి. వ్యంగ్య వార్తా పత్రిక.. ఛార్లీ హెబ్డో పాత కార్యాలయానికి సమీపంలో దుండగులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మళ్లీ పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలు ఇవే..

బంగారం, వెండి ధరల వరుస తగ్గుదలకు బ్రేక్ పడింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం మళ్లీ రూ.51 వేలకు చేరువైంది. వెండి కిలోకు భారీగా రూ.2,100కు పైగా పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో రికార్డుకు అతి చేరువలో ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. టీ20ల్లో 298 సిక్సులు బాదిన మహీ.. మూడువందల క్లబ్​లో చేరేందుకు కేవలం రెండు సిక్సర్లే కొట్టాల్సి ఉంది. శుక్రవారం దిల్లీతో జరిగే మ్యాచ్​లో అతడు ఈ ఘతన సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!

తనలాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టమని, గతంలో ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. దానితో పాటే పలు విషయాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details