ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - telugu news

ప్రధాన వార్తలు @ 5 PM

5 pm top ten news
టాప్ టెన్ న్యూస్

By

Published : Apr 7, 2021, 4:58 PM IST

  • రేపే పరిషత్ పోరు.. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ

రేపటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథాతథం జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ నిన్న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్​ బెంచ్​ కొట్టివేసింది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇవాళ, రేపు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం

ఇవాళ, రేపు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు వీయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వక్ఫ్ బోర్డు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు'

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరో భారీ కుంభకోణానికి తెరతీశారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం నిర్మించారని.. అనర్హులైన వ్యక్తులకు వక్ఫ్ బోర్డు భూములను కట్టబెట్టి.. వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ.3099 చెల్లిస్తే... రెండు బట్టల సబ్బులు ఇచ్చారు!

ఆన్​లైన్​లో హార్డ్​డిస్క్ కోసం ఆర్డరిచ్చిన యువకుడికి పార్శిల్ వచ్చింది. పార్శిల్ తీసుకునే ముందే నగదు చెల్లించాడు. తీరా ఓపెన్ చేసి చూస్తే... అందులో హార్డ్​డిస్క్ బదులు, రెండు బట్టల సబ్బులున్నాయి. అది చూసి ఖంగుతిన్న సదరు యువకుడు ఇదేంటని పార్శిల్ కేంద్రం వారిని అడగ్గా.. తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కడప జిల్లా రెడ్డయ్య మఠంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కశ్మీర్​లో భారీగా డ్రగ్స్​ పట్టివేత

జమ్ముకశ్మీర్​లో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 1,730 సీసాల 'కోడైన్​ పాస్పేట్​'ను స్వాధీనం చేసుకున్న కశ్మీర్​ పోలీసులు.. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'షా ఆదేశాలతోనే.. ఓటర్లపై జవాన్ల వేధింపులు'

బంగాల్‌లో ఓటర్లను సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వేధిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దాదాపు రూ.600 ఎగబాకింది. వెండి ధర కిలో రూ.65 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అఫ్గాన్​ ఘర్షణల్లో 59 మంది మృతి'

అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఘర్షణల్లో 59 మంది మరణించారని స్థానిక యుద్ధ పర్యవేక్షణ బృందం వెల్లడించింది. మృతుల్లో.. 42 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపింది. 9 మంది భద్రతా దళ సిబ్బంది, 8 మంది పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రికార్డుల ఫకర్​.. ర్యాంకింగ్స్​లో పైపైకి

ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్​లో ఫకర్ జమాన్ దూకుడు చూపించాడు. 12వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆర్​ఆర్ఆర్'​ అప్డేట్​.. 'వకీల్​సాబ్'​ సాంగ్​

'ఆర్​ఆర్​ఆర్'​ యూఎస్​ఏ థ్రియేట్రికల్​ రైట్స్​ను సరిగమ సినిమాస్​, రఫ్తార్​ క్రియేషన్స్​ దక్కించుకున్నాయి. 'వకీల్​సాబ్'​ సినిమాలోని 'కదులు కదులు' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడాలంటే క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details