- ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద... లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా నదికి వరద కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గంట గంటకూ ప్రవహ ఉద్ధృతి పెరుగుతోంది. బ్యారేజి వద్ద 7.03 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీలతో పాటు.. పలు లంక గ్రామాలు నీట మునిగాయి. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సీఎం జగన్.. దిల్లీ పెద్దలను కలిసేది కేసుల మాఫీ కోసమే'
ముఖ్యమంత్రి జగన్ తన సొంత కేసుల మాఫీ కోసమే దిల్లీ పెద్దలను కలుస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. మాట తప్పను - మడమ తిప్పను అని చెప్పుకొనే జగన్.. ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2021 ఆరంభం నాటికి కరోనా వ్యాక్సిన్!
కరోనా టీకా అభివృద్ధి కోసం పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని సుప్రీంను కోరారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు
కేరళకు చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు. 2015లో ఐఎస్ఐఎస్లో చేరి, ఇరాక్‌లో పలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు నేరం రుజువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆయన చెవిలో మారుమోగుతున్న 253 విదేశీ రేడియోలు!