- ఎస్పీ బాలు మరణంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల తెదేపా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎస్పీ బాలు మృతి తీరని లోటని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుర్భర దారిద్య్రంలో జీవనం.. అయినా గుర్తింపు దొరకని దైన్యం
ఊరికి దూరంగా నివసిస్తారు... ఎలుకలు, ఉడుములు వేటాడుతూ జీవిస్తారు. పొట్ట నింపుకునేందుకు భిక్షాటన చేస్తారు. దుర్భర దారిద్య్రం, వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నా సామాజిక వర్గం పరంగానైనా ప్రభుత్వ గుర్తింపు లేని దుస్థితి. ఎస్సీ జాబితా నుంచి తొలగిస్తూ జరిగిన అన్యాయంపై బేడ బుడగ జంగాల మనోవ్యథ ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోటి మందికి పైగా కరోనా తెలియకుండా వచ్చిపోయింది
సిరో సర్వైలైన్స్ ఆధారంగా రాష్ట్రంలో కోటి రెండు లక్షల మందికి కరోనా తెలియకుండానే వచ్చి వెళ్లినట్లు గుర్తించామని కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 19.8 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని సిరో సర్వైలెన్స్లో తేలిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సుందర తీరం... వ్యర్థాల మయం...!
లాక్డౌన్ ఎన్నో ప్రకృతి వింతల్ని పరిచయం చేసింది. పర్యావరణం పులకించి ఊహకందని అనుభూతిని పంచింది. పర్యాటక ప్రదేశాలు మన జాడ లేక బోసి పోలేదు సరికదా... అక్కడి జంతు జాతులు ఆనందంతో పరవశించి మనల్ని ఆశ్చర్య పరిచాయి. ప్రకృతి స్వేచ్ఛగా వికసించడాన్ని ఎంతో అద్భుతంగా చూసిన మనం... ఆ మార్పుని ఇప్పుడు దెబ్బతీస్తున్నామా..? కాలుష్య రహితంగా మారిన పర్యాటక ప్రదేశాలను తిరిగి వ్యర్థ కూపాలుగా మార్చుతున్నామా..? ప్రస్తుతం విశాఖ సాగర తీరంలో పరిస్థితి చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 3 దశల్లో బిహార్ ఎన్నికలు- నవంబర్ 10న ఫలితం
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు 3 దశల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ జరగనుండగా... అన్ని దశల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'