- సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ
తిరుమల పర్యటనలో రెండోరోజు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాద నీరాజనం వేదికగా జరిగిన సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యుత్ లేక.. చీకటిలోనే చికిత్స.. ఆసుపత్రిలో రోగుల అవస్థ
ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తే.. చిమ్మ చీకట్లో వైద్యులు చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో అంతరయానికి.. ఇన్వర్టర్ మొరాయింపు తోడైంది. చివరికి.. చరవాణి వెలుగులోనే.. వైద్యులు బాధితుడికి చికిత్స చేయాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆసుపత్రిలోని ఈ పరిస్థితి.. అక్కడి మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాతో మృతి చెందిన వ్యక్తి ఇంట్లో చోరీ.. నగదు, నగలు మాయం
ఆ ఇంటి పెద్దకు కరోనా సోకింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు చెన్నైకు తీసుకెళ్లారు. 18 రోజులపాటు అందరూ అక్కడే ఉన్నారు. అయినా ఆ మహమ్మారి తగ్గకపోగా ఇంటి యజమానిని బలితీసుకుంది. అక్కడే అంత్యక్రియలు, మిగిలిన క్రతువులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగివచ్చారు. కుటుంబ పెద్ద చనిపోయాడనే బాధతో వచ్చినవారికి ఇక్కడ మరో షాక్ తగిలింది. ఇంటిని మొత్తం దొంగలు దోచుకెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దిల్లీలో ఏం చేశారో చెప్పండి... ప్రభుత్వానికి తెదేపా డిమాండ్
సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో ఏఏ అంశాలు చర్చించారో వెల్లడించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే!
దేశం మొత్తం కరోనా వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో బలవర్ధకమైన గాడిద పాలను మార్కెట్లోకి సరఫరా చేసేందుకు హరియాణాలో డెయిరీని ప్రారంభించనుంది జాతీయ సంస్థ ఎన్ఆర్సీఈ. ఈ పాలు లీటరుకు రూ.7 వేలకు విక్రయించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వార్డులోకి నీరు- స్ట్రెచర్‌పై వైద్యుడి సేవలు