- అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి సీఎం జగన్
సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటల ముందుగానే ముఖ్యమంత్రి దిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకా హత్య కేసులో మరో ముగ్గురు అనుమానితుల విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో మరో ముగ్గురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగినప్పుడు వారు వివేకా ఇంటి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సురక్ష ఏపీ'గా తీర్చిదిద్దుతాం: సోము వీర్రాజు
భాజపా రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షుల సమావేశం విజయవాడలో జరిగింది. రాష్ట్రంలో భాజపా బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 280వ రోజూ అమరావతి రైతుల ఉద్యమ హోరు
280వ రోజూ అమరావతి రైతుల ఉద్యమ హోరు కొనసాగుతోంది. అమరావతికి భాజపా మద్దతు తెలపాలని రైతులు కోరారు. హైకోర్టులో భాజపా అఫిడవిట్ దాఖలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతికే మద్దతు ఇచ్చిన జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ ఎంపీలు క్షమాపణ చెబితేనే వేటుపై పునరాలోచన'
సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎంపీలు క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే వారిపై ఉన్న వేటును ఎత్తివేయడంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకే రోజు ఆరు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదం
2020 ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనితో కలిపి మొత్తం ఈ రోజు ఆరు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచ దిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదిలీ కలకలం
ప్రపంచ దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ షేర్లు సోమవారం రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ రెండు బ్యాంకులు సహా పలు ఇతర బ్యాంకింగ్ దిగ్గజాలు గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ నిధుల లావాదేవీలు జరిగాయంటూ వచ్చిన వార్తలు ఇందుకు కారణం. అనుమానిత కార్యకలాపాల నివేదికల (ఎస్‌ఏఆర్) నుంచి లీకైన వివరాల ఆధారంగా బజ్‌ఫీడ్ సహా ఇతర వార్తా సంస్థలు దీనికి సంబంధించి పలు కథనాలు రాశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికాలో కార్చిచ్చు బీభత్సం- 14 వేల చ.కిమీ దగ్ధం
అమెరికాలో కొన్ని రోజులగా కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానం కారణంగా అక్కడి ప్రజలకు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. వేలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూపర్ ఓవర్ నిబంధన ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
దిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఉత్కంఠపోరులో దిల్లీ గెలిచి ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఈ నేపథ్యంలో క్రికెట్లో సూపర్ ఓవర్ అంటే ఏమిటి? తొలిసారిగా ఈ నిబంధనను ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారు? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- ఎవరూ చూడట్లేదని జాన్వీ డ్యాన్స్.. కానీ!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో 'గుంజన్ సక్సేనా' చిత్రంలో ఆమె సోదరుడిగా నటించిన అంగద్ బేడీతో కలిసి స్టెప్పులేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.