- 'సింహాల ప్రతిమలు కనిపించటం లేదు.. దర్యాప్తు చేయండి'
కనకదుర్గమ్మ వెండి రథంపై ఉండే సింహాల్లో మూడు అదృశ్యమైన ఘటనలో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కోరారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశ్రమలకు విద్యుత్ రాయితీ.. ప్రకటనలకే పరిమితం!
పరిశ్రమలకు ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్తు రాయితీ అందటంలేదు. దరఖాస్తు చేసుకోవటంపై అవగాహన లేక, సాంకేతికత తెలియని వారు అనేకమంది ఉన్నారు. మరోపక్క కొంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా... ప్రకటన చేసి నెలలు గడిచినా ఇంతవరకూ అమలుకు నోచుకోవటం లేదు. లాక్ డౌన్ కష్టాల నుంచి పరిశ్రమలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం చేసిన ప్రకటన ఎంతో తోడ్పాటునిస్తుందని ఆశించినవారికి భంగపాటే ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రపంచ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుదాం'
ప్రపంచ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కరోనా కారణంగా కష్టపడ్డాం.. త్వరలోనే బయటపడతాం'
కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంపై కోవిడ్ ప్రభావం అంతా ఇంతా కాదు. భారత నౌకా వాణిజ్య ఎగుమతులు, దిగుమతులపైనా తీవ్రంగానే ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. గత 6 నెలలుగా విశాఖ పోర్టు ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై... పోర్ట్ ఛైర్మన్ కే. రామ్మోహన్ రావు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- 'ముందు నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే'
మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్రం. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కోసం ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జంగిల్ సఫారీ.. తప్పక వెళ్లాలోసారి...