- ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభం
మహిళా స్వయం సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటోది. ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పాజిటివ్ వ్యక్తి అత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ముండెపూలంకలో కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అవమానంతోనే ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఏఎఫ్‌సీ పాఠశాలల మూసివేత
ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కార్పొరేట్‌కు ధీటుగా పురపాలక విద్యాలయాలను తీర్చిదిద్ది జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2016 డిసెంబరులో రాష్ట్రంలో 17 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ఫౌండేషన్ కోర్స్ పాఠశాలలు మూతపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 2 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల 81వేల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6లక్షల 42వేల పరీక్షలు చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐసోలేషన్‌లో ఐటీ మంత్రి.. కారణమిదే...