1. నాపై కోపంతో వారిని ఎందుకు ఇబ్బంది పెడతారు?
సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ మెసేజ్ షేర్ చేసినందుకు తెదేపా సానుభూతిపరుడు కిశోర్‌ను అరెస్ట్ చేయటం దారుణమని మాజీమంత్రి గంటాశ్రీనివాసరావు మండిపడ్డారు. కిశోర్ చేసింది దేశద్రోహమా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రజల తిరుగుబాటు తప్పదు
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తోందని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి అన్న మాటల్లో వాస్తవం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులు అమ్మి పరిపాలన
రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తోందే తప్ప ఆదాయం పెంచుకోవట్లేదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పన్ను ఎగవేత అడ్డుకునేందుకు ప్రత్యేక విభాగం
పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు హెచ్‌వోడీ పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉద్రిక్తల వేళ సైన్యాధిపతి లద్ధాక్ పర్యటన
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి నరవాణే లద్ధాఖ్‌కు ఈ రోజు వెళ్లనున్నారు. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. నడ్డా-రాహుల్ మధ్య 'చైనా' వార్
భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ అంశంపై అధికార, విపక్ష నేతల మధ్య మాటలు, ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ హయాంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ, హస్తం పార్టీల మధ్య అలాంటి ఒప్పందం కుదిరిందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మండుతున్న పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 17వ రోజూ లీటర్ పెట్రోల్ ధర 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు 50 పైసలకు పైనే పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో మంగళవారం ప్రధాన నరగాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చైనా కీలక విజయం
అంతరిక్షంలో మరో అడుగు ముందుకు వేసింది చైనా. సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటులో భాగంగా చివరి ఉపగ్రహాన్ని గగనతలంలోకి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది చైనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. దేశం కాదు.. ప్రేమ ముఖ్యం
సానియా మీర్జాతో వివాహం గురించి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పందించాడు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రేమకు ఎప్పుడూ అడ్డురావని అన్నాడు. తానేమీ రాజకీయ నాయకుడ్ని కాదని.. ఒక క్రికెకటర్ అని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మరోసారి జోడీ కట్టనున్న నాని, సాయిపల్లవి
నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్' అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుండగా.. ఓ హీరోయిన్గా సాయి పల్లవి ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.