1. రాజధానిలో మంత్రి బొత్స పర్యటన
రాష్ట్ర మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రహదారులు, కరకట్ట మార్గం, ఇప్పటివరకూ పూర్తైన నిర్మాణాలు, పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ నిధి
రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాబార్డు ఛైర్మన్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి చింతల గోవిందరాజులు. మొత్తం 2.50 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తున్నట్లు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు . కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే రుణాల్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని బ్యాంకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనాతో మారిన బోధన
కరోనా కారణంగా పాఠశాల, కళాశాల విద్యా విధానాల్లో మార్పులొస్తున్నాయి. ఎప్పుడు తెరుచుకుంటాయోననే సందిగ్ధత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. ఓ పక్క రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలను తెరవాలంటే యాజమాన్యాలు భయపడిపోతున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మహమ్మారుల సమరంలో ముంబయి గెలిచేనా?
కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క ముంబయి నగరంలోనే నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. అయితే ముంబయిలో ఇలాంటి భయంకర పరిస్థితి కొత్తేమీ కాదు. అప్పట్లో వచ్చిన ప్లేగు వ్యాధి ఈ నగరాన్ని ఇలాగే అతలాకుతలం చేసింది. మరి ఆ విపత్తును అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది.. ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పాక్ సైన్యం కాల్పుల్లో భారత్ జవాన్ వీర మరణం
జమ్ముకశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.