1. ఉద్రిక్తతల వేళ లద్దాఖ్‌లో సైన్యాధిపతి నరవాణే పర్యటన
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ లద్ధాఖ్ పర్యటనకు సిద్ధమయ్యారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి. నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్‌లో పర్యటిస్తారు. గల్వాన్ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్ నరవాణే లద్దాఖ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. దేశంలో కరోనా విజృంభన
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 14,933 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 312 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనా మరణాలకు చైనాదే బాధ్యత
కరోనా వైరస్ అంశంపై మరోమారు చైనాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది శ్వేతసౌధం. వైరస్ మరణాలకు చైనాదే పూర్తి బాధ్యత అని చెప్పడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ చింతించరని పేర్కొంది. అదే సమయంలో ట్రంప్ చేసిన 'కుంగ్ ఫ్లూ' ఆరోపణలు జాతి వివక్ష వ్యాఖ్యలు కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెదేపా సానుభూతిపరుడు అరెస్ట్
తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ 3 రోజుల కిందట కిషోర్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పదోన్నతలు
రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ...ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.