- 'అమరావతి ఉద్యమ భేరి' వర్చువల్ సభ
అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి అన్నదాతల ఉద్యమం 500వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఉద్య భేరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.లైవ్ కోసం క్లిక్ చేయండి.
- రైతులు, మహిళలకు అంతిమ విజయం దక్కాలి: చంద్రబాబు
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలను అవమానించినందుకే రాష్ట్రంలో ఇన్ని ఉపద్రవాలన్నీ తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని ఉద్యమంలో మహిళలు, రైతులు అంతిమంగా విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాతో తితిదే డిప్యూటీ ఈవో మృతి
కొవిడ్‌తో తితిదే డిప్యూటీ ఈవో కె. నాగరాజు మృతి చెందారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో డిప్యూటీ ఈవోగా నాగరాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో మరో 3 లక్షల 86 వేల కరోనా కేసులు
దేశంలో కొవిడ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కొత్తగా 3,86,452 మంది వైరస్ బారిన పడ్డారు. 2 లక్షల 97 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కడుపులో 2 కిలోల కొకైన్- ఇద్దరు అరెస్ట్
కడుపులో మాదకద్రవ్యాలను పెట్టుకుని, అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు టాంజానియా జాతీయులను ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శస్త్ర చికిత్స అనంతరం సుమారు 2కిలోల కొకైన్‌ను వీరి కడుపు నుంచి బయటకు తీశారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అందరికీ అందుబాటులో ఔషధాలు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 65 శాతం భారతీయులు ఆధునిక వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించేందుకు కేంద్రం.. జన్ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఔషధాల సరఫరా సక్రమంగా జరగకపోవడం, ప్రజలకు వీటిపై అవగాహన కల్పించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 300 మైనస్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- రెండోసారి గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి గాల్లోకి ఎగిరింది. అమెరికాలోని కాలిఫోర్నియా మొజావ్ ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్ నుంచి ఎగిరిన విమానం.. 3 గంటల విహారం అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండ్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎల్ బయోబబుల్ సురక్షితం: జంపా
ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్ సురక్షితం కాదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు ఆస్ట్రేలియా, ఆర్సీబీ క్రికెటర్ ఆడమ్ జంపా. వైరస్ ఏ దశలోనూ బయోబబుల్‌లోకి చేరదని.. అలాంటి ఏర్పాట్లు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజీలు చేశాయని తెలిపాడు. ఈసారి కూడా ఐపీఎల్‌ను చివరివరకు చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాలీవుడ్ టీజర్లు!
బాలకృష్ణ 'అఖండ' టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 50 మిలియన్ల మార్క్‌ను అందుకుని సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఎక్కువ వీక్షణలు సొంతం చేసుకున్న టీజర్లు ఏంటి? వాటికి ప్రస్తుతం ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూసేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.