- దేశంలో కొత్తగా 2. 95 లక్షల కేసులు- 2000 మరణాలు
దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. దీంతో ఒక్కరోజే 2 లక్షల 95 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 2023 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం
భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం జరుగుతోంది. లైవ్ కోసం క్లిక్ చేయండి.
- 47 పట్టణాల్లో నీటి ఎద్దడికి అవకాశం.. ప్రభుత్వానికి పురపాలకశాఖ ప్రతిపాదన
రాష్ట్రంలోని 47 పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ నెలాఖరుతో ‘ఇసుక’ పొరుగు సిబ్బంది తొలగింపు
ఈ నెలాఖరుతో ‘ఇసుక’ పొరుగు సేవల సిబ్బందిని తొలిగిపుంకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. వచ్చే నెల నుంచి వీరి సేవలు అవసరం లేదంటూ ఏజెన్సీ తొలగింపునకు నోటీసు మంగళవారం జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముగ్గురు ఓఎన్జీసీ అధికారుల అపహరణ
అసోం శివసాగర్ జిల్లాలో ముగ్గురు ఓఎన్జీసీ అధికారులను కిడ్నాప్ చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఐఎస్ఐతో సంప్రదింపులు.. ప్రతిపక్షాలకు తిరస్కారాలా?'
దుబాయ్‌లో ఉన్న ఐఎస్ఐ నాయకులతో మాట్లాడే కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష నాయకులతో మాత్రం చర్చలు జరపట్లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. కరోనా రెండో దశ తప్పనిసరిగా వస్తుందని సీరోసర్వేలు వెల్లడించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు. కరోనాతో ప్రజలు కన్నీరు కారుస్తుంటే అధికార నాయకులు సభల్లో ఎలా నవ్వగలుగుతున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!
కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయోగంలో పురోగతి సాధించారు శాస్త్రవేత్తలు. ఇన్ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు వైరస్ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్రిటన్ బృందంలో సౌమ్య స్వామినాథన్‌కు చోటు
మహమ్మారులపై పోరాటానికి బ్రిటన్ ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌కు స్థానం దక్కింది. పాండమిక్ ప్రిపేర్డ్నెస్ పార్ట్నర్షిప్(పీపీపీ) పేరుతో ఏర్పాటుచేసిన ఈ బృందం మంగళవారం సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్ బోర్డు జాతీయ సెలెక్టర్ పదవి రద్దు
ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్ పదవి ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇకపై జట్టు ఎంపికలో తుది నిర్ణయం కోచ్ క్రిస్ సిల్వర్వుడ్దే. ఎంపిక ప్రక్రియలో అతడికి మోర్గాన్, రూట్ సహకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆదిపురుష్' అప్డేట్ ఇంతకీ ఉందా?
'ఆదిపురుష్' అప్డేట్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇంతకీ అది వస్తుందా రాదా అని అభిమానులు చర్చింటుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం 'ఆదిపురుష్' హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.