ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

టాప్ టెన్ న్యూస్

1 pm top news
టాప్ న్యూస్

By

Published : Jan 29, 2021, 1:01 PM IST

  • ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్​కు ఎస్‌ఈసీ లేఖ
    ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణను తప్పించాలని గవర్నర్​కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్​ప్రకాష్​ను తప్పించాలంటూ.. సీఎస్​కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ
    ఎన్నికల విధుల నుంచి సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్​ ప్రకాష్​ని తప్పించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలివ్వాలని సీఎస్​కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • జీవో 77ను ఉపసంహరించాలి: లోకేశ్
    రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఐపీసీ కాకుండా జగన్ పీనల్ కోడ్(జేపీసీ) అమలు చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు, విద్యార్థులపై అత్యాచారం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మెుదటి అంకం... నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
    స్థానిక ఎన్నికల పోరులో తొలి దశ అయిన.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10.30 నిమిషాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'రిపబ్లిక్​ డే' ఘటన బాధ కలిగించింది: రాష్ట్రపతి
    ఇటీవల జాతీయ పతాకానికి అవమానం కలిగించే ఘటనలు జరిగాయాని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనలు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • '2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం'
    దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి గతేడాది ఆర్థిక మంత్రి పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని చెప్పారు. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల ప్రారంభానికి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
    వారాంతం సెషన్​ను భారీ లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 50 పాయింట్లకు పైగా కోల్పోయి 46,818కి చేరింది. నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 13,811 వద్ద ట్రేడవుతోంది. లైవ్ అప్​డేట్ల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ఐరాస చీఫ్​
    ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ కొవిడ్​-19 టీకా​ తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్​ అనంతరం హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • యాంజియోప్లాస్టీ తర్వాత నిలకడగా గంగూలీ ఆరోగ్యం
    బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. కోల్​కతాలోని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గతరాత్రి ఆయన సౌకర్యవంతంగా నిద్రపోయినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆర్​ఆర్​ఆర్, ప్రభాస్​-నాగ్అశ్విన్ చిత్రాల అప్​డేట్స్ ఇవే!​
    'ఆర్​ఆర్​ఆర్' నుంచి నటి ఒలివియా మోరిస్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రం నుంచి ఓ అప్​డేట్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details