- అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా దిల్లీలో భాజపా నిరసన
అంతర్వేది ఘటనపై సీఎం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో భాజపా, జనసేన నేతలు నిరసన చేపట్టారు. దుండగులను శిక్షించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి'
అప్పన్నబంగారం అమ్ముతామంటూ జరిగిన మోసంలో ఇంటి దొంగల పాత్ర పట్టు బడింది. దేవాలయ సిబ్బంది ఇందులో కీలక పాత్ర ,ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేయడం ఇందులో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో దాదాపు రూ.38 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పొరుగు సేవల సిబ్బందిపై సరైన నిఘా కొరవడినందునే మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆదాయానికి కరోనా గండి
కరోనా ప్రభావంతో విశాఖ జిల్లాలో పలు పౌర సేవలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్రభుత్వానికి అదాయం తెచ్చే శాఖలైన రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపైనా పౌర సేవా విభాగాలపైనా ప్రభావం చూపుతోంది. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో దాదాపు 5 నుంచి ఆరు శాతం మంది సిబ్బంది కొవిడ్ బారిన పడి హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొవిడ్ తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం రిజిస్ట్రేషన్ కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి వేలి ముద్రలు సేకరించడం, పలు చోట్ల సంతకాలు చేయాల్సి రావడం వంటి వాటి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీనికి తోడు కార్యాలయాల్లోకి వచ్చి పోయే వారిని తనిఖీ చేసే వ్యవస్ధలు అంత పటిష్టంగా లేకపోవడం కూడా వ్యాప్తికి ఒక కారణంగా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- త్వరలో 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
రాష్ట్రంలో పర్యటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. దిల్లీలోని ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాయుసేన 17వ స్క్వాడ్రన్‌లో చేరిన రఫేల్
నాలుగేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత వాయుసేన అమ్ములపొదిలోకి భీకర రఫేల్ యుద్ధవిమానాలు అధికారికంగా చేరాయి. భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల సమక్షంలో 17వ స్క్వాడ్రన్ 'గోల్డెన్ యారోస్'కు రఫేల్‌ను రక్షణ శాఖ అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సరిహద్దు సమీప ప్రజలను ఎక్కడికీ పంపించట్లేదు!'