ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ETELA WON: హుజురాబాద్​లో ఈటల ఘన విజయం.. 24 వేల 68 ఓట్ల మెజార్టీతో గెలుపుబావుటా.. - హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల ఘన విజయం

తెలంగాణలోని హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ విజయ కేతనం ఎగురవేశారు. 22 రౌండ్లలో 24 వేల 68 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. భాజపా- తెరాస హోరాహోరిగా తలపడిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో తొలి రౌండ్‌ నుంచే ఈటల రాజేందర్‌ ఆధిపత్యం సాధించారు.

హుజురాబాద్​లో ఈటల ఘన విజయం
హుజురాబాద్​లో ఈటల ఘన విజయం

By

Published : Nov 2, 2021, 8:17 PM IST

తెలంగాణలోని హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ విజయ కేతనం ఎగురవేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఘన విజయం సాధించారు. భాజపా- తెరాస హోరాహోరిగా తలపడిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో తొలి రౌండ్‌ నుంచే ఈటల రాజేందర్‌ ఆధిపత్యం సాధించిన ఈటల... కేవలం రెండు రౌండ్లలో మాత్రమే స్వల్ప తేడాతో వెనుకబడ్డారు. మొత్తంగా... 22 రౌండ్లలో 24 వేల 68 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు.

శాలపల్లి, హిమ్మత్​నగర్​లోనూ ఆధిక్యమే..

రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు ప్రవేశపెట్టిన శాలపల్లిలోనూ తెరాస ప్రభావం చూపలేకపోయింది. అక్కడ కూడా ఈటల రాజేందర్‌ ఆధిపత్యం ప్రదర్శించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామమైన హిమ్మత్‌నగర్‌లోనూ ఈటలకు ఆధిక్యం దక్కింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఈటల పైచేయి సాధించారు.

8, 11 రౌండ్లలో కాస్త వెనబడినా..

22 రౌండ్ల ఫలితాల్లో.... 20 రౌండ్లలో భాజపా ఆధిక్యం సాధించింది. 8, 11 రౌండ్‌లో మాత్రమే గులాబీ పార్టీకి ఆధిక్యం దక్కింది. తొలిరౌండ్‌ నుంచి 7 రౌండ్ల వరకు భాజపా ఆధిపత్యం కొనసాగింది. ఎమినిదో రౌండ్‌లో మాత్రం తెరాసకు 162 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తొమ్మిది, పదో రౌండ్‌లో భాజపా ఆధిక్యం సాధించింది. 11వ రౌండ్‌లో మళ్లీ తెరాస ఆధిక్యం ప్రదర్శించగా... పన్నెండో రౌండ్‌ నుంచి ఈటల రాజేందర్‌ దూకుడు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. 22 రౌండ్లు పూర్తయ్యేసరికి.. భాజపాకు 1,06,780, తెరాసకు 82,712 ఓట్లు దక్కగా.. భాజపాకు 24 వేల 68 ఓట్లతో సంపూర్ణ మెజార్టీ దక్కింది.

ముందు నుంచే ఆధిక్యం..

భాజపాకు తొలిరౌండ్‌లో 166 ఓట్లు రాగా.... రెండో రౌండ్‌లో 358 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కమలం పార్టీకి మూడో రౌండ్‌లో 905, నాలుగో రౌండ్‌లో 562 ఓట్ల మెజార్టీ దక్కింది. ఐదో రౌండ్‌లో 344, ఆరో రౌండ్‌లో 1017 ఓట్లు, ఏడో రౌండ్‌లో 246 ఆధిక్యాన్ని... ఈటల రాజేందర్‌ సాధించారు. ఎనిమిదో రౌండ్‌లో మాత్రం తెరాస... 162 ఓట్ల స్వల్ప మెజార్టీ పొందింది. తొమ్మిది రౌండ్‌లో 18 వందల 35, పదో రౌండ్‌లో 586 ఓట్ల ఆధిక్యాన్ని... భాజపా సాధించింది. పదకొండో రౌండ్‌లో తెరాసకు మళ్లీ 385 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 12వ రౌండ్‌ నుంచి ఈటల రాజేందర్‌ తిరుగులేని జోరు మొదలైంది.

అక్కణ్నుంచి తగ్గనేలేదు..

12 వ రౌండ్‌లో 12 వందల 17, 13వ రౌండ్‌లో 18 వందల 65, 14వ రౌండ్‌లో వెయ్యి 46, 15వ రౌండ్‌లో 2 వేల 49 ఓట్ల ఆధిక్యం భాజపాకు వచ్చింది. 16వ రౌండ్‌లో భాజపాకు 17 వందల 12 ఓట్ల ఆధిక్యం లభించింది. 17వ రౌండ్‌లో భాజపాకు 14 వేల 23 ఓట్ల ఆధిక్యం సాధించింది. 18వ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 18 వందల 76 ఓట్ల ఆధిక్యం దక్కింది. 19వ రౌండ్‌లో భాజపాకు 3 వేల 47 ఓట్ల ఆధిక్యం దక్కింది.20వ రౌండ్‌లో 14 వందల 74, 21వ రౌండ్‌లో 17 వందల 20, 22వ రౌండ్‌లో వెయ్యి 33 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

కాంగ్రెస్​ డిపాజిట్​ గల్లంతు..

పోస్టల్‌ బ్యాలెట్లలో తెరాసకు ఊరట లభించింది. తెరాస 455 ఓట్లు రాగా... భాజపాకు 242 పోస్టల్‌ ఓట్లు వచ్చాయి. అవి ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఇక హుజురాబాద్‌ ఉపపోరులో కాంగ్రెస్‌ కనీస ప్రభావం చూపలేకపోయింది. అన్ని రౌండ్లలో అరకొర ఓట్లతోనే కాంగ్రెస్​ సరిపెట్టుకుంది. హస్తం అభ్యర్థి బల్మూర్‌ వెంకట్‌ నర్సింగరావుకు కనీసం ధరావతు కూడా దక్కలేదు.

హుజురాబాద్​లో ఈటల ఘన విజయం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details